NTV Telugu Site icon

Chandrababu: చనిపోతే ఒక్క క్షణం.. జైల్లో అనుమానాస్పద ఘటనలు.. చంద్రబాబు సంచలనం

Chandrababu Aha

Chandrababu Aha

నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే షో ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా నాలుగో సీజన్ స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ స్వయానా బావ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మొదటి ఎపిసోడ్ షూట్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ షోలో అరెస్ట్ గురించి అడిగితే దానికి బాబు సమాధానం ఇచ్చారు. నంద్యాలలో మీటింగ్ పూర్తి చేసుకొని అక్కడ బస చేస్తే రాత్రంతా డిస్టర్బెన్స్ చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారు అంటే తర్వాత నోటీసు ఇస్తాం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడా ఇలా జరగదు, తప్పు ఎవరు చేసినా ఎక్కడ చేసాడో చెప్పి అతని సమాధానం విని నోటీసు ఇచ్చి అప్పుడు దాని బట్టి అరెస్ట్ చేస్తారు.

Chandrababu: ఆ రోజుని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నా.. చంద్రబాబు ఎమోషనల్

కానీ ఏమి లెక్కచేయకుండా ఇన్వెస్టిగేషన్ అధికారి కాకుండా ఎవరో సూపర్వైజరీ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఆ తర్వాత అక్కడా ఇక్కడా తిప్పి కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు ఆర్గ్యుమెంట్స్ చేశారు. అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు పంపించారు. ఆ రాత్రి చేయని తప్పుకు అరెస్ట్ చేయడం, ఆ చేసిన విధానం చూసి గుండె తరుక్కుపోయిందని అన్నారు. నేను రాజమండ్రి జైలుకు వెళ్ళినప్పుడు సందేహంగా కొన్ని సంఘటనలు జరిగాయి, అయినా నేను ధైర్యంగా ఉన్నాను, ఎదుర్కొన్నాను కాబట్టి ఏమి జరగలేదని అన్నారు. లేకపోతే ఏమయ్యేదో ఇంకోలా ఉండేది. చనిపోతే ఒక్క క్షణం. అనుకున్న ఆశయం కోసం పని చేస్తే అది శాశ్వతం అంటూ ఆయన కామెంట్ చేశారు. అదే నన్ను ముందుకు నడిపించిందన్న ఆయన చావు గురించి ఆలోచిస్తే జీవితంలో ఏది చేయలేమని అన్నారు.