సినిమాల్లో అవకాశం రావాలని ఎంతో మంది ఎదురుచూస్తుంటారు.. కొంత మంది ఫేమ్ వచ్చాక గుమ్మం వరకు వచ్చిన ప్రాజెక్టులన్నీ చేసేస్తుంటారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని అనుకుంటారు. కానీ కొంత మంది మాత్రం తనకు నచ్చిన కథలు, మెచ్చిన పాత్రలనే చేసుకుంటూ క్వాలిటీ కోసం పరితపిస్తుంటారు. అలాంటి వారిలో చైతూ జొన్నలగడ్డ కూడా ఉంటాడు. నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. వెబ్ సిరీస్, సినిమాలు అన్ని చోట్ల చైతూకి మంచి పేరు వచ్చింది.
Also Read : Naga Chaitanya : తండేల్ డిసెంబర్ లో రాదు.. కారణం ఇదే..
బబుల్‌గమ్, భామాకలాపంలో మంచి రోల్స్ పోషించి టాలీవుడ్ ఆడియెన్స్‌ను మెప్పించాడు చైతూ జొన్నలగడ్డ, డీజే Tillu హీరో సిద్దు జొన్నలగడ్డ కు స్వయానా అన్నయ అయినటువంటి చైతూ జొన్నలగడ్డ ఇప్పుడు చైతూ తనలోని మల్టీటాలెంట్‌ను చూపించేందుకు రెడీ అవుతున్నాడు. MM2 అంటూ తనలోని రైటర్, యాక్టర్‌ను పరిచయం చేయబోతున్నాడు. ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్టుల్ని కూడా లైన్‌లో పెట్టాడు చైతూ జొన్నలగడ్డ . తన వద్దకు వచ్చిన పాత్రల్ని వడపోసి. కథ బలంఉండి, తనకు నచ్చిన కారెక్టర్‌లను మాత్రమే ఎంచుకుంటూ సినీ కెరీర్ లో ముందుకు వెళ్తున్నాడు చైతూ . ఈ క్రమంలో చైతూ జొన్నలగడ్డ ఇప్పటికే ఓ మూడు ప్రాజెక్టులకు ఓకే చెప్పాడు. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న హిట్ – 3 లో ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఈటీవీ విన్‌లోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. పవన్ సాధినేనితో మరో సినిమాను చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో MM2 స్టార్ట్ చేయబోతున్నాడు