NTV Telugu Site icon

Chaitanya Reddy : హనుమాన్ కు మేము అనుకున్నంత కలెక్షన్లు రాలేదు..

Untitled Design (6)

Untitled Design (6)

ఈ ఏడాది సంక్రాంతికి విడులైన సినిమాలలో హనుమాన్ ఒకటి. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటెర్టైనమెంట్స్ బైనర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా బాషలలో విడుదలయిన ఈ చిత్రం అన్ని భాషలలోను సూపర్ హిట్ సాధించి 2024 సంక్రాతి హిట్ గా నిలిచింది.

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది హనుమాన్. ప్రపంచ వ్యాప్తంగా ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా 237 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఓవర్సీస్ లో 57 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా క్లోజింగ్ గ్రాస్ 294 కోట్లు రాబట్టి టాలీవుడ్‌లో టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచి స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కు నెట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కాసుల వర్షం కురిపించింది హనుమాన్. ఎప్పుడూ చూడని లాభాలు చూపించింది.

కాగా హనుమాన్ నిర్మాతల్లో ఒకరైన చైతన్య రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ” హనుమాన్ చిత్రంతో తాము ట్రెమండస్ సక్సెస్ చూసాం, మాకు చాలా మంచి పేరు వచ్చింది. కానీ ట్రెమండస్ లాభాలు చూడలేదు. గ్రాస్ చేస్తున్న వాల్యూస్ కి ప్రొడ్యూసర్ కి వచ్చే వాల్యూస్ కి చాలా తేడా ఉంది. ఒక సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ రాబడితే నిర్మాతకు ఎంత మిగులుతుంది అనేది నిర్మాతకు, అకౌంటెంట్ కు మాత్రమే తెలుస్తుండెమో, బహుశా అది ట్రేడ్ సీక్రెట్ ఏమో” అని అన్నారు.

Also Read: Dhanush : నా ఫేవరెట్ హీరో ఆయనే..మల్టీస్టారర్ ఆ హీరోతో మాత్రమే చేస్తా..!

Show comments