Site icon NTV Telugu

New Celeb Trend : పెళ్లయ్యాక విడాకుల కంటే ముందే విడిపోవడమే బెటర్‌

Tollywood Breakup

Tollywood Breakup

‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఆచరణలో ముఖ్యంగా సినీ సెలబ్రిటీల జీవితంలో ఇది అసాధ్యంగా మారుతోంది. పెళ్లి బంధం ఒకటి, రెండేళ్ల పంటగా మారిపోతున్న సందర్భాలు అనేకం. అయితే, ఇప్పుడు పెళ్లి సంగతి తర్వాత… నిశ్చితార్థం అయిన నెలలకే బ్రేకప్‌లు చెప్పుకోవడం ట్రెండ్‌గా మారింది. నిశ్చితార్థం జరిగి, పెళ్లికి ముందే విడిపోవడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. కొందరు సెలబ్రిటీలు తాము విడిపోతున్నట్లు బహిరంగంగా ప్రకటిస్తుంటే, మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకుంటూ, పాత జ్ఞాపకాలను డిలీట్ చేస్తూ అభిమానులకు హింట్‌లు ఇస్తున్నారు.

Also Read:Akhanda 2: మళ్లీ ఆందోళనలో బాలయ్య అభిమానులు.. అఖండ 2 ఉంటుందా? లేదా?

ఈ జాబితాలో తాజాగా చేరింది నటి నివేదా పేతురాజ్. ‘బ్రోచేవారెవరురా’, ‘అలా వైకుంఠపురంలో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్.. దుబాయ్‌కు చెందిన ఓ బిజినెస్‌మేన్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అయితే, ఇటీవలే వారిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ముఖ్యంగా ఎంగేజ్‌మెంట్ ఫోటోలు డిలీట్ చేయడంతో… ఈ జంట కూడా నిశ్చితార్థం రద్దు చేసుకుందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిశ్చితార్థం తర్వాత బ్రేకప్ చెప్పుకున్న సెలబ్రిటీల జాబితా ఇది:

మెహ్రీన్ పిర్జాదా: ‘భవ్య బిష్ణోయ్’తో నిశ్చితార్థం చేసుకున్న మెహ్రీన్, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు.

రష్మిక మందన: తన తొలి సినిమా ‘కిరాక్ పార్టీ’ హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడిన రష్మిక, అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ, కొంతకాలానికే వారి బంధం బ్రేకప్‌తో ముగిసింది.

రష్మిక – విజయ్ దేవరకొండ (అనుమానాలు): రష్మిక, విజయ్ దేవరకొండల నిశ్చితార్థం జరిగిందనే వార్తలు తరచూ ప్రచారంలోకి వస్తుంటాయి. ఈ ఇద్దరూ తమ చేతులకు కొత్త ఉంగరాలతో కనిపించడంతో.. లవర్స్ అని, రహస్యంగా ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ జంట ఈ విషయాన్ని ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు.

త్రిష కృష్ణన్: అగ్ర కథానాయికగా దూసుకుపోతున్న త్రిష… చెన్నైకి చెందిన బిజినెస్‌మేన్ వరుణ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ, వ్యక్తిగత భేదాభిప్రాయాల (డిఫరెన్సెస్) కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి త్రిష మళ్లీ పెళ్లి ఊసెత్తకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

అఖిల్ అక్కినేని: అక్కినేని యువ హీరో అఖిల్, ప్రముఖ బిజినెస్‌మేన్ కూతురు శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక, చివరి నిమిషంలో ఈ నిశ్చితార్థం రద్దయ్యి, ఆ బంధం బ్రేకప్‌గా మిగిలింది. ఆ తర్వాత అఖిల్, బిజినెస్‌మేన్ కూతురు జైనాబ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Also Read:Akhanda 2: ‘అఖండ 2’ ఎఫెక్ట్‌తో మారిన సినిమాల ఫైనల్ రిలీజ్ డేట్‌లివే!

సినిమా సెలబ్రిటీల బ్రేకప్‌లు చూస్తుంటే, నిశ్చితార్థానికి, పెళ్లికి మధ్య ఉన్న గ్యాప్ ముఖ్య కారణంగా కనిపిస్తోంది. అయితే, ఈ గ్యాప్ రావడమే మంచిది అని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. పెళ్లికి ముందు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, మనస్పర్థలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. పెళ్లి తర్వాత డిఫరెన్సెస్‌ వచ్చి విడాకులతో సపరేట్ కావడం కంటే, ముందే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడం, పెళ్లి కాకుండానే విడిపోవడం మంచిదని, ఇదే ఉత్తమమైన మార్గమని వారు సూచిస్తున్నారు.

Exit mobile version