తెలుగులో విడుదలైన “లిటిల్ హార్ట్స్” సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన పరోక్షంగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి చేసిన వ్యాఖ్యలు వ్యాప్తి చెందడంతో, ఈ అంశంపై బన్నీ వాసు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నిజంగా షాకింగ్‌గా అనిపించాయి. అల్లు అరవింద్ గారు ఇండస్ట్రీకి చేసిన సేవలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆయన గురించి అలా మాట్లాడడం నాకు చాలా బాధ కలిగించింది. ఆ రోజు ఈవెంట్‌లో ఉన్న హ్యాపీ మూడ్ అంతా గల్లంతయ్యింది” అని తెలిపారు.
Also Read : Mirai : ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మూవీ
ఇంతకి సక్సెస్ మీట్‌లో గణేష్ ఏం మాట్లాడారు అంటే.. “ఇప్పుడు నీ సినిమా హిట్ అయింది కాబట్టి అందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు. మహేష్ బాబు ట్వీట్ చేశాడు, విజయ్ దేవరకొండ షర్ట్ ఇచ్చాడు అని ఆనందపడకు. కొందరికే అదృష్టం దక్కుతుంది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ మెగాస్టార్ బావమరిదిలా, స్టార్ కమెడియన్ కొడుకులా, ఐకాన్ స్టార్ తండ్రిలా పుట్టలేరు. కొందరికే అదృష్టం దక్కుతుంది. మిగతావాళ్లంతా కష్టపడితే చివరికి క్రెడిట్ మాత్రం వాళ్లకే వెళ్లిపోతుంది” అని తెలిపారు. బన్నీ వాస్ స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే, అల్లు అరవింద్ గారి కృషిని అలా పబ్లిక్ ఈవెంట్‌లో విమర్శించడం సరైన పద్ధతి కాదు అని.
