తాను వేసిన ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ ఒకటి అత్యంత ఖరీదైన కళాకాండంగా నిలిచిందంటూ, బ్యుల రూబీ అనే పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. స్వతహాగా తెలుగు అమ్మాయి అయిన బ్యుల రూబీ, జూనియర్ ఎన్టీఆర్ సహా తెలుగు హీరోలకు సంబంధించి ఎన్నో పెన్సిల్ స్కెచ్‌లు వేసి, ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే, తాజాగా ఆమె ట్విట్టర్ ద్వారా “ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ పెన్సిల్ ఆర్ట్ ఆఫ్ ది తెలుగు యాక్టర్ ఎవర్ సోల్డ్” అంటూ జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ ఆర్ట్‌ను ఆమె షేర్ చేసింది.
Also Read : Vijayawada: సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ .. 9 కి వాయిదా
దాన్ని 1650 యుఎస్ డాలర్స్‌కి అమ్మినట్లుగా, సుమారు 1,45,300 రూపాయలు ఆమె బ్యాంక్ అకౌంట్‌లో పడినట్లుగా చెబుతూ ఆమె పిక్ షేర్ చేసింది. అయితే, ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు, కానీ ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా పేరు ఫిక్స్ చేయలేదు, కానీ “డ్రాగన్” అనే ప్రచారం జరుగుతోంది.