Janhvi Kapoor: ‘స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు’.. ‘పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన బుచ్చిబాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. ఈ చిత్రం జూన్ 4న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ వరుస ప్రెస్ మీట్లు, ఈవెంట్లతో ప్రమోషన్లను పీక్స్‌కు తీసుకువెళ్లింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి డైరెక్టర్ బుచ్చిబాబు తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. జాన్వీ కపూర్‌కు తెలుగు భాషపై ఉన్న శ్రద్ధను, ఆమె సింప్లిసిటీని కొనియాడుతూ బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మా అసిస్టెంట్ డైరెక్టర్లను పట్టుకుని తెలుగు నేర్చుకుంది..
జాన్వీ కపూర్ ఎంత స్మార్ట్ అండ్ టాలెంటెడో చెప్తూ బుచ్చిబాబు ప్రశంసలు కురిపించారు. “జాన్వీ కపూర్ చాలా తెలివైనది. నిన్న జరిగిన ఈవెంట్లో తెలుగులో మాట్లాడడం కోసం ఆమె మా అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర తెలుగు నేర్చుకుంది. లొకేషన్లోనే కాకుండా ప్రమోషన్లలోనూ ఆమె చూపిస్తున్న ఈ డెడికేషన్ నిజంగా గ్రేట్” అని బుచ్చిబాబు కొనియాడారు. అంతేకాదు ఈరోజు ప్రెస్ మీట్ ఉందనగానే జాన్వీ కపూర్ ఎంతో సరదాగా స్పందిస్తూ.. “ఈరోజు మళ్లీ ప్రెస్ మీట్ ఉందా.. నిన్నటితో నాకున్న తెలుగు అంతా అయిపోయింది” అని తనతో అన్నట్లు బుచ్చిబాబు నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.
Also Read
శ్రీదేవి కూతురిని అనే పొగరు ఇసుమంత కూడా లేదు
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, జాన్వీ కపూర్ లొకేషన్లో ఎంత ఒదిగి ఉంటుందో బుచ్చిబాబు వెల్లడించారు. “స్టార్ కిడ్ అనే అహంకారం, శ్రీదేవి గారి కూతురిని అనే పొగరు ఆమెలో ఇసుమంత కూడా కనిపించదు. అందరితో ఎంతో మర్యాదగా, వినయంగా ఉంటుంది” అని జాన్వీ రియల్ క్యారెక్టర్‌ను బుచ్చిబాబు రివీల్ చేశారు. గతంలో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జాన్వీ కపూర్, ఇప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంలో ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌కు తగ్గ పక్కా లోకల్ క్యారెక్టర్‌తో అలరించబోతోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!