బీటీఎస్ మూజిక్ బ్యాండ్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతోంది. సంగీత సామ్రాజ్యంలో ప్రస్తుతం బీటీఎస్ సింగర్స్ కి తిరుగులేదు. అయితే, మొత్తం ఏడుగురు సభ్యుల బీటీఎస్ టీమ్ కి ‘ఆర్ఎం’ లీడర్ గా వ్యవహరిస్తుంటాడు. ‘ఆర్ఎం’ అనేది బీటీఎస్ ప్రధాన గాయకుడి పేరు. తాజాగా ఆయన ‘బైసైకిల్’ పేరుతో ఓ సోలో సాంగ్ విడుదల చేశాడు!
ఆదివారం నాడు ఆర్ఎం తన తాజా గీతాన్ని ప్రపంచం ముందు ఉంచాడు. ‘ఆర్మీ’గా తమని తాము పిలుచుకునే బీటీఎస్ అభిమానులు సొషల్ మీడియాలో హంగామా ప్రారంభించేశారు. ‘బైసైకిల్’ పాటలో తమ సెవన్ ఫేవరెట్ సింగర్స్ లేనప్పటికీ ఆర్ఎం గాత్రాన్ని, అలాగే ఆయన రాసుకున్న బ్యుటిఫుల్ లిరిక్స్ ని ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక జాన్ హ్యుంగ్ గిటార్ రాగాలు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి, శ్రోతలకి!
‘బైసైకిల్’ తాను ఎప్పటి నుంచో రిలీజ్ చేయాలనుకుంటోన్న పాట అన్నాడు ఆర్ఎం. కానీ, ఇంత కాలం తగినంత ప్రేరణ లభించక లిరిక్స్ పూర్తి చేయలేకపోయాడట. 2021 ఫిబ్రవరీ, మార్చ్ నెలల్లో ఆయనకు ఎట్టకేలకు సమయం చిక్కిందట. అప్పుడు తనకు ఎంతో ఇష్టమైన సైకిల్ పై స్వారీ చేస్తూ మనసులోంచి లిరిక్స్ వెలికితీశాడట! అందుకే, ‘బైసైకిల్’ పాటలోని సాహిత్యం అద్భుతం అంటున్నారు బీటీఎస్ అభిమానులు. ఈ మధ్యే బీటీఎస్ టీమ్ ‘బట్టర్’ అనే పాట విడుదల చేసింది. అది భారీగా రికార్డులు బద్ధలు కొట్టింది. గ్రూప్ సాంగ్ కాగానే వెంటవెంటనే ఆర్ఎం తన సోలో పర్ఫామెన్స్ తో రావటం… దేశదేశాల్లోని బీటీఎస్ ఫ్యాన్స్ ని ఆనందానికి గురి చేస్తోంది!