Site icon NTV Telugu

Devara : ఫాన్స్ కి షాక్.. అక్కడ 1 AM షోస్ క్యాన్సిల్.. ఎందుకంటే?

Devara 1 Am Shos

Devara 1 Am Shos

Devara Brahmarambha 1AM Show Cancelled: నందమూరి అభిమానులకు షాక్ తగిలింది. నందమూరి అభిమానులందరూ సెంటిమెంటుగా భావించే కూకట్పల్లి భ్రమరాంబ – మల్లికార్జున థియేటర్ లో రాత్రి ఒంటిగంటకు వేయాల్సిన షోలు వేయడం లేదని తెలుస్తోంది. ఆ షోలు క్యాన్సిల్ చేసినట్లుగా థియేటర్ బయట పోస్టర్ దర్శనమిచ్చింది. నిజానికి ఈ రెండు థియేటర్లలో ఒంటిగంట షోలకు సంబంధించిన టికెట్ల విక్రయం ఇప్పటికే జరిగిపోయింది. అయితే సినిమా డిస్ట్రిబ్యూటర్, థియేటర్ యాజమాన్యం మధ్య వచ్చిన ఇంటర్నల్ క్లాష్ కారణంగా ఈ షో క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఉదయం నాలుగు గంటల నుంచి మిగతా సోర్స్ యథావిధిగా కొనసాగుతాయి కానీ ఒంటిగంట షో మాత్రం క్యాన్సిల్ అయినట్లుగా చెబుతున్నారు.

Narsingi Police Station: నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ, హర్షసాయి రేప్ కేసుల దర్యాప్తు

నిజానికి నందమూరి హీరోల సినిమాలు ఈ థియేటర్ లో చూడటం సెంటిమెంట్ గా భావిస్తారు కొంతమంది నందమూరి అభిమానులు. బాలకృష్ణ సైతం తాను నటించిన సినిమాల మొదటి షో కూడా ఇక్కడికి వచ్చే చూస్తారు. కొన్నిసార్లు రాజమౌళి కుటుంబ సభ్యులు సైతం ఇక్కడికి వచ్చి సినిమాలు చూసిన దాఖలాలు ఉన్నాయి. అయితే సాధారణంగా స్పెషల్ షోస్ లాంటివి వేసినప్పుడు థియేటర్ మేనేజ్‌మెంట్ వారి కోసం 20-25% టిక్కెట్లను డిమాండ్ చేస్తుంది. కానీ భ్రమరాంబ థియేటర్ మేనేజ్‌మెంట్ తమకు 70% టిక్కెట్‌లను బేస్ ధరకి ఇవ్వాలని, స్పెషల్ షో కోసం డిస్ట్రిబ్యూటర్ సహా అభిమానులకు 30% టిక్కెట్‌లను మాత్రమే విడుదల చేయాలని కోరారట. అయితే డిస్ట్రిబ్యూటర్ అందుకు ససేమిరా అనడంతో ఈ షోస్ క్యాన్సిలేషన్ దాకా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ షోని ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూటర్ హోల్డ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో థియేటర్ యాజమాన్యం ముందుగా షో క్యాన్సిల్ అయినట్లుగా థియేటర్ బయట బోర్డులు పెట్టారు.

Exit mobile version