Site icon NTV Telugu

ట్రెండింగ్ లో “బాయ్ కాట్ సల్మాన్ ఖాన్”… ఏం జరిగిందంటే ?

Salman Khan

Salman Khan

బాలీవుడ్ మెగాస్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ట్విట్టర్ లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. “బాయ్ కాట్ సల్మాన్ ఖాన్” అనే హ్యాష్ ట్యాగ్ ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం సుశాంత్ సింగ్ రాజ్ పుత్. అసలేం జరిగిందంటే…

సల్మాన్ ఖాన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో 33 ఏళ్ళు అవుతోంది. సల్మాన్ 1988లో “బివి హో తో ఐసి” అనే ఫ్యామిలీ డ్రామాతో మూవీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇందులో ఆయన కేవలం సహాయక పాత్రలో కన్పించాడు. ఆ తర్వాత సూరజ్ బర్జాత్యా బ్లాక్ బస్టర్ రొమాంటిక్ మూవీ “మైనే ప్యార్ కియా” (1989)లో ప్రధాన పాత్ర పోషించి, ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఏదేమైనా ఆయన నటించిన మొదటి చిత్రం “బివి హో తో ఐసి” 1988లో ఆగష్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సల్మాన్ అభిమానులు “33 ఇయర్స్ అఫ్ సల్మాన్ ఖాన్ ఎరా” అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలెట్టారు.

అది అలా ట్రెండ్ అయ్యిందో లేదో “బాయ్ కాట్ సల్మాన్ ఖాన్”తో సల్మాన్ పై ఫైర్ అవుతూ ట్వీట్ చేస్తున్నారు దివంగత నటుడు సుశాంత్ సింగ్ అభిమానులు. సుశాంత్ తుది శ్వాస విడిచినప్పటి నుండి ఆయన అభిమానులు న్యాయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వారు కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, మహేష్ భట్ మొదలైన ప్రముఖులను టార్గెట్ చేశారు. తాజాగా మరోసారి సల్మాన్ ను టార్గెట్ చేశారు. ఇతర నెటిజన్లను అతన్ని, అతని రాబోయే సినిమాలను బహిష్కరించమని అడుగుతున్నారు.

Read Also : ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి

సుశాంత్ సింగ్ రాజ్, సల్మాన్ ఖాన్ హత్యకు సంబంధం ఏంటి ? సల్మాన్ ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ? అనే అనుమానం వచ్చిందా? సల్మాన్ ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే… సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించినప్పుడు సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోలెవరూ పెదవి విప్పలేదు. కానీ సుశాంత్ కు సపోర్ట్ చేస్తూ ఒక్క కామెంట్ అయినా చేయలేదు. దీంతో సుశాంత్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. అప్పటికే బాలీవుడ్ మాఫియా అంటూ ఫైర్ అయ్యే కొంతమంది నెటిజన్లకు సుశాంత్ ఫ్యాన్స్ కూడా తోడవ్వడంతో ఆ సునామీని బాలీవుడ్ తారలు తట్టుకోలేకపోయారు. అలియా భట్, సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ వంటి స్టార్ కిడ్స్ సైతం నెపోటిజం పేరుతో దారుణంగా ట్రోలింగ్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా సుశాంత్ సింగ్ కు న్యాయం కావాలని కోరుతూ సల్మాన్ ను బ్యాన్ చేయాలంటూ “బాయ్ కాట్ సల్మాన్ ఖాన్” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ రష్యాలో కత్రినా కైఫ్‌తో కలిసి “టైగర్ 3” షూటింగ్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఇంకా పూర్తి కాకముందే బ్యాన్ చేయాలనీ కోరుతున్నారు నెటిజన్లు. సుశాంత్ కు, ఆయన మాజీ మేనేజర్ దిశా కేసుకు సంబంధం ఉందని, సల్మాన్ ను బాయ్ కాట్ చేస్తే స్వచ్ఛ భారత్ అవుతుందని అంటున్నారు. అంతేకాదు గతంలో సల్మాన్ కేసులకు సంబంధించిన పలు విషయాలను కూడా ఇందులో బయటకు తీస్తున్నారు నెటిజన్లు.

మరోవైపు సుశాంత్ సింగ్ కేసు నత్త నడక నడుస్తోంది. ఏడాది గడిచిపోయినా ఇంకా ఈ కేసును దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. మరి దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానుల కోపం ఎప్పటికి చల్లారుతుందో !!

Exit mobile version