ఖుషీ తర్వాత టాలీవుడ్ ఆడియన్స్‌తో కాస్త గ్యాప్ తీసుకున్న సమంత.. సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు మా ఇంటి బంగారంతో వచ్చేస్తోంది. మే 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ బొమ్మ కొన్ని రీజన్స్‌తో కొద్ది రోజుల వాయిదా అనంతరం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కానీ సామ్ నాలుగైదు సినిమాలతో పోటీ పడాల్సిన పరిస్థితి. సామ్ ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ అండ్ డెబ్యూ హీరో హర్షిత్ రెడ్డి ఇప్పుడు సమంతకు పోటీగా మారాడు. హర్షిత్ నటించిన ‘దీవానా’ కూడా జూన్ 19నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
90స్‌లో అమ్మాయిల క్రష్ హీరోగా మారిన వడ్డే నవీన్.. పదేళ్ల తర్వాత కనిపించబోతున్న ఫిల్మ్ ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’. ఈ సినిమాను వడ్డే నవీన్ నిర్మిస్తున్నాడు. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మూవీ. అలాగే డబ్బింగ్ చిత్రాలు కూడా సమంత మూవీని టార్గెట్ చేయబోతున్నాయి. విజయ్ ఆంటోనీ, స్వాసిక లీడ్ రోల్ పోషిస్తున్న నూరు సామిని ఇక్కడ ‘వంద దేవుళ్లు’గా రిలీజ్ చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్ హౌస్ మలయాళంలో తెరకెక్కించిన ఫిల్మ్ బాలన్ ది బాయ్. మంజుమ్మల్ బాయ్స్ ఫేం చిదంబరం డైరెక్టర్. జీతూ మాధవన్ కథ అందించాడు. ఈ సినిమా జూన్ 19నే రిలీజ్ కాబోతుంది. తెలుగులోనూ ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ అదే రోజు విడుదల చేస్తోంది. ఇవే కాకుండా చిన్న చితకా సినిమాలు, గౌతమ్ నంద రీ రిలీజ్ కూడా సామ్ మా ఇంటి బంగారంతో పోటీ పడుతున్నాయి. మూవీ మే 15న రిలీజయ్యి ఉంటే.. కరుప్పు ఒక్కటే కాంపిటీషన్ అయ్యి ఉండేది. మరే సినిమా లేదు కాబట్టి కరుప్పును టాలీవుడ్ ఆడియన్స్ ఆదరించారు కానీ మా ఇంటి బంగారం కంటెంట్ బాగుంటే ఐపీఎల్, సమ్మర్ కూడా లెక్క చేసేవారు కాదేమో? ఇప్పుడైనా టాక్ బాగుంటే చూస్తారు కానీ కలెక్షన్స్ ఎఫెక్ట్ కచ్చితంగా కనబడుతుంది. మరీ ఈ శుక్రవారం ఏ మూవీ విన్నర్ అవుతుందో లెట్స్ వెయిట్

