Boom Boom : బూమ్ ‘బూమ్ బూమ్’ అంటున్న అర్జున్ అంబటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్ధనారి, తెప్ప సముద్రం, వెడ్డింగ్ డైరీస్ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించిన అర్జున్ అంబటి, ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా సుపరిచితుడయ్యాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘పరమపద సోపానం’. ఈ సినిమాలో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుంది. ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ బ్యానర్‌పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో, గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మాతగా, గుడిమిట్ల ఈశ్వర్ సహ నిర్మాతగా వ్యవహరించారు.
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగ శివ, ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ వంటి భారీ బడ్జెట్ చిత్రంతో సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన డేవ్ జాండ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ‘పరమపద సోపానం’ జూలై 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల ప్రమోషన్స్‌ను కూడా ఆరంభించారు. ఈ క్రమంలో విడుదల తేదీ పోస్టర్‌తో పాటు, ‘చిన్ని చిన్ని తప్పులేవో’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ రెండూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టాయి.
Also Read
- Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
- Nagarjuna: 'చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?'.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
- Sundeep Kishan: 'కరికాల' నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
- Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ 'బడ్జెట్ పిచ్చి' ఎవరిని ముంచుతుంది?
ముఖ్యంగా ‘చిన్ని చిన్ని తప్పులేవో’ పాట వైరల్ అవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ప్రమోషన్స్‌లో భాగంగా, చిత్ర యూనిట్ రెండవ లిరికల్ సాంగ్‌ను కూడా విడుదల చేసింది.’భూమ్ భూమ్’ అనే ఈ ఉత్సాహభరితమైన మాస్ నంబర్‌ను కొద్దిసేపటి క్రితం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రముఖ గాయని గీతా మాధురి ఈ పాటను ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “‘పరమపద సోపానం’లో ‘భూమ్ భూమ్’ పాటను పాడాను. నాగ శివ పూరి జగన్నాథ్ గారి వద్ద అసోసియేట్‌గా పలు సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు దర్శకుడిగా ‘పరమపద సోపానం’తో మన ముందుకు వస్తున్నారు. ‘భూమ్ భూమ్’ పాటను చాలా ఆనందంగా పాడాను. ఇది చక్కటి స్వింగ్ ఉన్న పాట. ఈ పాట ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. టీమ్ అందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు,” అని అన్నారు.
- Tags
తాజావార్తలు
-
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
-
Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
-
CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!