ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా 9 ఉగ్ర శిబిరాలపై భారత దళాల దాడులు చేసి ఉగ్రవాదులను అంతం చేసింది భారత ఆర్మీ. అయితే భారత్ ఆర్మీ కి మద్దతుగా యావత్ భారత్ మొత్తం సెల్యూట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ అని సోషల్ మీడియాలో తమ వంతుగా మద్దతు ప్రకటించారు. అలాగే మన టాలీవుడ్ నటీనటులు సైతం తమ వంతుగా సైన్యానికి వదనం చేస్తూ మద్దతు ప్రకటించారు.
కానీ బాలీవుడ్ స్టార్ హీరోల తీరు పలు వివాదాలకు దారి తెస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలుగా పిలవబడే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారు కనీసం మద్దుతుగా ఒక ట్వీట్ కూడా చేయకపోవడం వారికీ దేశం పట్ల అలాగే ఆర్మీ పట్ల ఉన్న గౌరవం ఏపాటిదో తెలుస్తోందని నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగే మరొక నటుడు సైఫ్ అలీఖాన్ సైతం ఎటుంవంటి మద్దతు తెలపలేదు. అదే ఈ స్టార్ హీరోలు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న వాటికీ కోట్లకి కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుని వాటిని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తుంటారు. కానీ వారికి ఇంత స్టార్ డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్, ఇంతగా ఆదరిస్తున్న ఈ దేశ ప్రజల పట్ల కనీసం గౌరవం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయినా సరే తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు సదరు ఖాన్స్.
