Bollywood : భారీ రన్ టైమ్ తో రిలీజ్ కాబోతున్న బాలీవుడ్ బిగ్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి, పుష్ప2 లాంటి భారీ సినిమాల దెబ్బకి బాలీవుడ్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పటి దాకా లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో ఆకట్టుకున్న రణవీర్ సింగ్ కూడా ఇప్పుడు భారీ యాక్షన్ వైపు టర్న్ తీసుకుని,’ధురంధర్’అనే మాస్ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ కాంబినేషన్ లో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది దురంధర్. ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాను ‘ఉరి’ దర్శకుడు ఆదిత్య ధర్ 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఇప్పటి కే రిలీజ్ అయిన ట్రయిలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
Also Read : Varanasi : SS రాజమౌళి వారణాసిలో మహేశ్ బాబు మేనళ్లుడు
Also Read
బి-టౌన్‌లో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ఈ సినిమా మేజర్ మోహిత్ శర్మ బయోపిక్ అని రూమర్స్ రావడంతో దర్శకుడు క్లారిటీ ఇస్తూ “మోహిత్ శర్మ త్యాగం గొప్పది కానీ దానికి దురంధర్‌కి సంబంధం లేదు. టైమ్ వచ్చాక ఆయన బయోపిక్‌ను గొప్పగా చేస్తాం అని అన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా 3 గంటల 32 నిమిషాల రన్‌టైమ్ తో వస్తోంది. దాంతో దురంధర్ కూడా ఇండియా లాంగెస్ట్ రన్‌టైమ్ మూవీస్ లిస్ట్‌లోకి ఎంటర్ అవుతుంది. పాన్ ఇండియా వేవ్‌లో భాగంగా RRR, పుష్ప 2, కల్కి, బాహుబలి ఎపిక్ లాంటి సినిమాలు లాంగ్ రన్‌టైమ్ తోనే రిలీజ్ అయ్యాయి. పాన్ వరల్డ్ హైప్ తో వచ్చి ఘన విజయం సాధించాయి కూడా. ఈ నేపధ్యంలో బాలీవుడ్ కూడా ఆ రూట్లో అడుగు వేస్తోందా అనే చర్చ బలంగా వినిపిస్తుంది. కాని, “ధురంధర్ కంటెంట్ స్ట్రాంగ్ ఐతే రన్ టైమ్ మ్యాటర్ కాదు కానీ అదే బలహీనమైతే అంత భారీ నిడివి చూడటానికి ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడే దురంధర్ కి పెద్ద పరీక్ష ఎదురవుతుంది. డిసెంబర్ 5 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఈ సినిమా పాన్ ఇండియా మాస్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
-
ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్‌ను కోల్పోయిన భారత్!
-
Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
-
The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్‌గా మారిన వీడియో
-
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!