NTV Telugu Site icon

Bollywood : పుష్ప -2 హిందీలో ఇప్పట్లో ఆగేలా లేదు.. మొత్తం ఎన్ని కోట్లంటే.!

Pushpa (4)

Pushpa (4)

ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిలింగా రూపొందిన ఈ చిత్రం పుష్ప -2. ఈ సినిమాలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నట విశ్వరూపం చూపించాడు. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ క్లాస్‌ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలిచింది. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించారు.సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

Also Read : Akhanda2 : బాలయ్య అఖండ -2 రిలీజ్ డేట్ వచ్చేసింది..

కాగా ఈ సినిమాహిందీ కల్కేషన్స్ సునామి సృష్టిస్తుంది అనే చెప్పాలి. ముంబై, ఢిల్లీ, బీహార్ ఇలా అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా పుష్ప రాజ్ బ్లాక్ బస్టర్ కల్కేక్షన్స్ రాబడుతున్నాడు. మొదటి నాలుగురోజులకుగాను రూ. 300 కోట్లు రాబట్టి బాలీవుడ్ లో అత్యంత వేగంగా ఈ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ అప్పటి వరకు మొదటి స్తానంలో ఉన్న షారుక్ ఖాన్ జవాన్ ను వెనక్కు నెట్టింది పుష్ప -2. కేవలం నాలుగు రోజుల్లోనే పుష్ప ఈ రికార్డును క్రియేట్ చేసింది. ఇక వర్కింగ్ డేస్ లో పుష్ప ఏ మేరకు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేయగా ఆ అంచనాలను పట పంచలు చేస్తూ దంచికొట్టింది పుష్ప 2. ఇక ఈ మంగళవారం రోజు హింది బెల్ట్ లో రూ. 36 కోట్లు రాబట్టింది. ఇక హిందీలో మొత్తంగా చుస్తే 6 రోజులకు గాను రూ. 375 కోట్లు గ్రాస్ రాబట్టింది. హిందీలో పుష్ప -2 ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదని ట్రేడ్ అంచనా వేస్తుంది.

Show comments