1- బాలీవుడ్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కానీ ఇంకా షూటింగ్ పెండింగ్‌లో ఉందని టాక్. వార్ 2తో పోటీ పడుతున్న కూలీ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసి. ప్రమోషన్ల వర్క్ షురూ చేసింది. కానీ వార్2 మాత్రం ఇంకా ఓ సాంగ్ పెండింగ్‍లో ఉందని టాక్. అదే తారక్ అండ్ హృతిక్ మధ్య డ్యాన్స్ సీక్వెన్స్. ఈ సాంగ్‌కు ఇద్దరు క్రేజీయెస్ట్ డ్యాన్సర్స్ కాలు కదపబోతున్నారు. ముంబయిలో యజ్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోలో ఈ ఇద్దరిపై సాంగ్ షూట్ చేస్తున్నాడట అయాన్ ముఖర్జీ. ఈ ఎనర్జటిక్ నంబర్‌ను కొరియోగ్రాఫర్ బాక్సో సీజర్ డిజైన్ చేస్తున్నాడట. వారం రోజుల పాటు ఈ ఇద్దరి మధ్య డ్యాన్స్ ఫైట్ జరగబోతుందని టాక్.
2- రైడ్ 2తో హిట్ ట్రాక్ ఎక్కిన వాణి కపూర్.. నెక్ట్స్ మండల మర్డర్స్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సిరీస్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జులై 25న నెక్ట్స్ ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది మండల మర్డర్స్. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సిరీస్‌ను నిర్మిస్తోంది.
3- బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్.. దాదాపు 23 ఇయర్స్ తర్వాత మెగా ఫోన్ పట్టుకున్నారు. 2002లో ఓమ్ జయ జగదీష్ తర్వాత బ్యాక్ సైడ్ ఆఫ్ కెమెరాకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు తన్వి ద గ్రేట్ అనే మూవీని తెరకెక్కించారు. శుభంగి దత్ అనే అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్న తన్వి ద గ్రేట్ నుండి ట్రైలర్ రిలీజయ్యింది. జులై 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
4- రన్ బీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా నటిస్తున్న భారీ మైథలాజికల్ చిత్రం ‘రామాయణ’. నమిత మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ముల్టీప్లెక్స్ లో ఈ గురువారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
