సలార్, కల్కి 2898 AD వంటి భారీ విజయాలతో దూసుకుపోతున్న రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రఖ్యాత పాన్-ఇండియా స్టూడియో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా స్పెషల్ అప్‌డేట్ అందించారు మేకర్స్. ఈ సినిమాలో రెబల్ స్టార్ తో పాటు బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని నటుడు అనుపమ్ ఖేర్ స్వయంగా పంచుకున్నాడు.
Also Read : Shiva Karthikeyan : విజయ్ సినిమా కోసం వెయిట్ చేస్తోన్న శివకార్తీకేయన్
విభిన్న పాత్రల ఎంపికకు పేరుగాంచిన అనుపమ్ మాట్లాడుతూ ‘‘ఇండియన్ సినిమా పరిశ్రమకు బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి నా 544వ ప్రాజెక్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా కథ అద్భుతంగా ఉంది. జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్’’ అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. 1940ల నాటి ఈ చారిత్రక కల్పన, ప్రత్యామ్నాయ చరిత్ర, యుద్ధం మాత్రమే సమాధానమని ప్రపంచం నుండి దాచిపెట్టిన పాతిపెట్టబడి, అన్యాయాలకు మరియు మరచిపోయిన సత్యాలకు రక్తపాతమే ఒక సమాధానం అని నమ్మే ఓ యోధుడి కథాంశంతో ఈ సినిమా రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా, ఒకప్పటి ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి మరియు జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ ఈ ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మించనున్నారు. సుదీప్ ఛటర్జీ ISC కెమెరామన్ గా వర్క్ చేస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.