NTV Telugu Site icon

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ లో అడుగుపెట్టిన బాలీవుడ్‌ హీరో..!

Boby Dol

Boby Dol

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా పీరియాడిక్ చిత్రం హరి హర వీర మల్లు. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో ప్రతినాయకుడి పాత్రలో హిందీ హీరో బాబీ డియోల్ నటించనున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే బాబీ డియోల్‌ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చాడు షూటింగులో జాయిన్ అయ్యారు. ఇక హరి హర వీర మల్లు సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో మల్ల యోధుడు వీరమల్లుగా పవన్‌ కళ్యాణ్‌ కనిపించనున్నారు. ఈచిత్ర కథ భారత దేశాన్ని మొఘలులు పాలించిన కాలం నేపథ్యంలో సాగుతుంది. అయితే.. ఈ చిత్రంలో మొఘల్ రాజు ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నట్లు సమాచారం. క్రిష్‌ జాగర్లమూడి కొన్ని రోజుల క్రితం ముంబై వెళ్లి బాబీ డియోల్‌కు కథ.. అందులో క్యారెక్టర్ గురించి వివరించారట.. ఆల్రెడీ హిందీలో క్రిష్ సినిమాలు చేసి ఉండటం.. ఆయన డైరెక్షన్ గురించి ఐడియా ఉండటం.. క్రిష్‌ చెప్పిన క్యారెక్టర్ బాబీకి నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశారట. టాలీవుడ్‌ లో బాబీ డియోల్‌కు తొలి తెలుగు చిత్రమిది. ఇంతకు ముందు ఆయన చేసిన కొన్ని హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు కూడా తెలుగులో అనువాదం అయ్యాయి. అయితే.. ఇప్పుడు పవన్ సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు బాబీ. తాజాగా సినిమాలో మేజర్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ చేశారు.

Read also: VV Lakshminarayana: ఎన్నికల్లో పోటీపై ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ..

ఆసినిమా షూట్‌ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఇక ఇప్పుడు బాబీ డియోల్ షెడ్యూల్ కోసం సిటీలోని ప్రముఖ స్టూడియోలో సెట్ వేశారు. బాబీకు వెల్కమ్ చెబుతూ కారు దిగిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇండియన్ సినిమాలో బిగ్ యాక్షన్ స్టార్ అయిన బాబీ డియోల్‌తో పని చేస్తుండటం సంతోషంగా, ఎగ్జైటెడ్ గా ఉంది అని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ కథా నాయిక కాగా..ఈ సినిమాలో నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక, తెలుగు అమ్మాయి పూజితా పొన్నాడ కూడా ఓ రోల్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణ బాధ్యతలు జ్ఞానశేఖర్ నిర్వర్తిస్తున్నారు. సంభాషణలు సాయి మాధవ్ బుర్రా అందిస్తున్నారు.

Read also: Kaikala Satyanarayana: నవరస నటనాసార్వభౌముడికి కన్నీటి వీడ్కోలు

అయితే బాబీ డియోల్ చాలా కాలంగా బాలీవుడ్ లో అస్సలు కనిపించలేదు. బాబీ ఫ్యాన్స్ చాలా నిరాస అయ్యారు. ఇప్పుడు బాబీ ఏకంగా పాన్ ఇండియాలో నటించడమే కాకుండా.. ఔరంగజేబు పాత్రలో కనిపించనుండటంతో ఫ్యాన్స్ కు పండగే అని చెబుతున్నారు. బాబీను ఔరంగజేబు పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. 1998లో హిందీ సోల్జర్ (soldier) మూవీతో ముందుకు వచ్చిన బాబీ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు చాలా కాలం తరువాత బాబీ టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్‌ కు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హరి హర వీర మల్లు పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్న ఈసినిమా 2023లో అంటే వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. హరి హర వీర మల్లు సెట్స్ మీద ఉండగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారట. వచ్చే సంవత్సరం జనవరి తర్వాత ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్టు సమాచారం. ఇక డీవీవీ దానయ్య నిర్మాతగా సుజీత్ దర్శకత్వంలో మరో సినిమాకు పవన్ కళ్యాణ్ పూజ చేసిన ఈసినిమా వచ్చే ఏడాదిలో సెట్స్ మీదకు వెళ్ళనున్నట్లు టాక్.

Show comments