NTV Telugu Site icon

Bolisetty Srinu: అల్లు అర్జున్ విషయంలో వెనక్కి తగ్గిన జనసేన ఎమ్మెల్యే?

Allu Arjun Pushpa 2

Allu Arjun Pushpa 2

Bolisetty Srinu Deleted Tweet Regarding Allu Arjun: అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆ విషయంలో వెనక్కి తగ్గారు. నిజానికి ఒక యూట్యూబ్ ఛానల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అల్లు అర్జున్ ని ఏమైనా పుడింగివా? ఆయన సొంత తండ్రిని ఎంపీగా గెలిపించుకోలేక పోయాడు. ఇష్టమైతేనే వస్తా అంటున్నాడు, అసలు నిన్ను రమ్మని ఎవరడిగారు? అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. ఆ తర్వాత ఆ వీడియో వైరల్ అయింది. అల్లు అర్జున్ అభిమానులతో పాటు చాలా మంది నెటిజన్లు బొలిశెట్టి శ్రీనివాస్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన మరొక ట్వీట్ చేశారు.

Mass 4K : థియేటర్ స్క్రీన్ కోసం బౌన్సర్లు.. ఇదెక్కడి మాస్ రా మావా

‘నాకు ఇష్టమైతేనే వస్తా, ఒక మెగా అభిమానిగా చిరంజీవి గారిని గాని నాగబాబు గారిని గాని పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా సరే గౌరవం లేకుండా మాట్లాడితే నేను వస్తా, గతాన్ని మర్చిపోయి మాట్లాడితే కచ్చితంగా వస్తానని కామెంట్ చేశారు. నా వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం, ఒక మెగా అభిమానిగా మాత్రమే నేను స్పందించా, గమనించగలరు అంటూ ఆయన పోస్ట్ చేశారు. అయితే ఏమని అనుకున్నారో ఏమో ఆ పోస్ట్ ను ఆయన తన ఖాతా నుంచి డిలీట్ చేశారు. అయితే ఆ తరువాత ఆయన యూట్యూబ్ ఛానల్ కోసం మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఆయన మీద అనేక ఆరోపణలు సైతం గుప్పిస్తున్నారు.

Show comments