బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తన భార్య తాన్య డియోల్ ఈ రోజు తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాబీ తాన్యాతో ఉన్న లవ్లీ పిక్స్ ను షేర్ చేసుకుంటూ తన భార్య కోసం ప్రత్యేకమైన నోట్ కూడా రాశాడు. “నా హృదయం, నా ఆత్మ. నా ప్రపంచం నువ్వే… నిన్ను ఎప్పటికీ, ఎప్పటికీ ప్రేమిస్తాను. 25 వ వార్షికోత్సవం” అంటూ భార్యతో ఉన్న పిక్స్ ను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానుల నుంచి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా బాబీ 1995లో తన మొదటి చిత్రం “బార్సాత్”తో స్టార్ అయ్యాడు. ఈ నటుడు తాన్యాను ముంబై హోటల్ ప్రెసిడెంట్ వద్ద ఒక ఇటాలియన్ రెస్టారెంట్‌లో మొదటిసారి చూశాడు. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. తాన్య ఒక ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ దేవ్ అహుజా కుమార్తె అని అతనికి తెలిసింది. ఆ తరువాత తన లవ్ ప్రపోజల్ ను ఆమె ముందుంచగా… తాన్య అంగీకరించింది. 1996లో వీరు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఆర్యమాన్ డియోల్, ధరమ్ డియోల్. ఇక సినిమాల విషయానికొస్తే… బాబీ చివరిసారిగా 2020 వెబ్ సిరీస్ “ఆశ్రమ్”లో కనిపించాడు. ప్రస్తుతం “అప్నే-2″లో కనిపించనున్నాడు.