NTV Telugu Site icon

Pushpa 2 The Rule: రేయ్ ఏంట్రా మీరు ఇలా ఉన్నారు.. గన్నులతో వెల్కమ్ ఏంటి?

Pushpa 3

Pushpa 3

‘పుష్ప-2: ది రూల్’ సినిమా కోసం ఎదురుచూస్తున్న జనాలకు రేపు ఒక ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 17న విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను పాట్నాలోని గాంధీ మైదాన్‌లో విడుదల చేయనున్నారు. ‘పుష్ప 2’ చిత్ర నిర్మాతలు ఇటీవల చిత్ర ట్రైలర్‌ను ముంబైలో లేదా హైదరాబాద్ లేదా ఢిల్లీలో విడుదల చేయడం లేదని బీహార్ రాజధాని పాట్నాలో విడుదల చేయనున్నట్టు చెప్పడంతో చాలా మంది అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఈ ఈవెంట్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో పాట్నాలో భారీ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. సూపర్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న కూడా పాట్నాకు రావడం అక్కడి అభిమానులకు పెద్ద విషయం.

Bhairathi Ranagal: త్వరలో తెలుగులో కన్నడ థ్రిల్లర్ “భైరతి రణగల్”

‘పుష్ప 2’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం 17 నవంబర్ 2024 న పాట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించబడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల తర్వాత ప్రారంభమవుతుంది, దీనికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉంది. బీహార్‌లో తొలిసారిగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో టీమ్ అంతా చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇందుకోసం గాంధీ మైదాన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ కి తుపాకులతో థియేటర్లో స్వాగతం పలుకుతామని అక్కడి వారు వీడియోలలో మాట్లాడడం వైరల్ అవుతోంది. ఈ వీడియోలు చూసిన మనోళ్లు రేయ్ ఏంట్రా మీరు ఇలా ఉన్నారు.. గన్నులతో వెల్కమ్ ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments