Bigg Boss Telugu 10: జియోహాట్‌స్టార్‌ను షేక్ చేస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’

Bigg Boss Telugu 10 2 300kb

Bigg Boss Telugu 10 2 300kb

తెలుగు వినోద రంగంలో బిగ్ బాస్ రియాలిటీ షో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ తాజా సీజన్ జియో హాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు కేటగిరీలో ఏకంగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియా.. ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతుండటం ఈ షోకి ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రేక్షకులతో ఈ రియాలిటీ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ ను ఈ తాజా రికార్డు హైలైట్ చేస్తోంది. బనిజయ్ ఆసియాలో భాగమైన ఎండెమోల్ షైన్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ షో, గ్లోబల్ ఫార్మాట్‌ను స్థానిక ప్రేక్షకులకు అనుగుణంగా అద్భుతంగా మలచడంలో వంద శాతం సక్సెస్ అయింది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో అనేక భాషల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలలో, తెలుగు వెర్షన్ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. తెలుగు హోస్ట్ నాగార్జున, మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ కిచ్చా సుదీప్, తమిళ హోస్ట్ విజయ్ సేతుపతి తమ తమ సెట్స్ నుంచి ఒకేసారి లైవ్‌లో స్క్రీన్‌ను పంచుకున్నారు. ఈ మెగా హోస్ట్‌లు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ లాంచ్ ఈవెంట్‌ను ఓ రేంజ్‌లో ఎలివేట్ చేశారు. కింగ్ నాగార్జున మార్క్ హోస్టింగ్, హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న రసవత్తర పోరుతో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ రికార్డులను తిరగరాస్తూ వినోద రంగంలో నంబర్ 1 గా దూసుకుపోతోంది.