Site icon NTV Telugu

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 సెటప్ రెడీ..! ఈసారి హౌస్‌లో ఎంటర్ కాబోయే స్టార్‌లు వీళ్లేనా?

Telugu Bigg Boss

Telugu Bigg Boss

తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగా ఇప్పుడు సీజన్ 9 కోసం  మరింత ఆసక్తిగా  ఎదురుచూస్తున్నారు. అయితే ఇక ఈ సారి షో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుందని, హోస్ట్‌గా మళ్లీ అక్కినేని నాగార్జున కనిపించనున్నట్లు సమాచారం. మరి ఈసారి హౌస్‌లోకి ఎంటర్ కాబోయే కంటెస్టెంట్స్ ఎవరంటూ ఇప్పుడే చర్చలు ఊపందుకున్నాయి. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా టీవీ సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబ్ స్టార్లు హౌస్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమై, కొంతమంది ఫైనల్ చేసినట్లు సమాచారం.

Also Read : Drishyam 3: ‘దృశ్యం 3’ పై అధికారికంగా ప్రకటన..

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం, ఈ సీజన్‌లో పాల్గొనబోయే పేర్లలో.. సీరియల్ నటి తేజస్విని,పబ్ వివాదంతో ఫేమస్ అయిన కల్పికా గణేష్, నిఖిల్ లవర్‌గా పాపులర్ అయిన కావ్య, ఆర్టిస్ట్ నవ్య స్వామి,ఛత్రపతి శేఖర్, టీవీ నటుడు ముఖేష్ గౌడ్, జ్యోతి రాయ్, సీనియర్ నటుడు సాయి కిరణ్,యూట్యూబర్ శ్రావణి వర్మ, ఆర్జే రాజ్,షార్ట్ ఫిల్మ్ స్టార్ బమ్ చిక్ బబ్లు. వారితో పాటు, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, సీరియల్ నటి డెబ్జానీ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అలాగే స్టార్ మా లో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ వంటి షోల నుండి కూడా కొన్ని ముఖాలు ఈ సీజన్‌లో కనిపించనున్నట్లు టాక్. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ పేర్లను బట్టి చూస్తే.. బిగ్‌బాస్ 9 మరింత కాంట్రవర్సీ, ఎంటర్‌టైన్‌మెంట్, డ్రామాతో నిండిన సీజన్‌గా రాబోతోందని స్పష్టమవుతోంది.

Exit mobile version