తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఆసక్తికర అప్‌డేట్లు వెలుగులోకి వస్తున్నాయి. కింగ్ నాగార్జున మళ్లీ హోస్ట్‌గా వ్యవహరించబోతుండటంతో, షోపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రోమో మంచి క్రేజ్ అందుకోగా. ఈ సారి ఓ నూతన ప్రయోగానికి తెరలేపారు. ఇప్పటివరకు సెలబ్రిటీలకే హౌస్‌లోకి ఎంట్రీ అవకాశం ఉండగా, ఈసారి సామాన్యులకు కూడా అవకాశమిస్తుండటం విశేషం. దీంతో యువత నుంచి విశేష స్పందన వస్తుంది. ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా వీడియో రిజిస్ట్రేషన్లు తీసుకున్నారు. “బిగ్ బాస్ హౌస్‌లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు?” అనే ప్రశ్నపై దరఖాస్తుదారులు వీడియోలు పంపించారు.
Also Read : Children Baldness: వారసత్వ బట్టతలపై మీకు తెలియని నిజాలు!
అయితే వేల కొద్ది అప్లికేషన్లను పరిశీలించగా 200 మందిని, తర్వాత 100 మందిని, ఫైనల్‌గా 40 మందిని ఎంపిక చేశారు. వీరిలో 3–4 మందికి షోలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. సామాన్యుల ఎంపిక ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తవుతుంది. కాగా సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే బిగ్ బాస్ 9ను స్టార్ మా లో టెలికాస్ట్ చేయనున్నారు. అలాగే జియో సినిమా & హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. 24/7 లైవ్ ఫీడ్‌తో ఈ సారి మరింత ఎంగేజ్‌మెంట్‌ను షో టార్గెట్ చేస్తోంది.
