NTV Telugu Site icon

Bigboss : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రోమో.. కంటెస్టెంట్ లను చూస్తే ఆశ్చర్యపోతారు..

Untitled Design (5)

Untitled Design (5)

ఈ ఆదివారం బుల్లితెర మోస్ట్ సక్సెస్ ఫుల్ షో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లాంచ్ కానుంది. గత 7 సీజన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తమ అభిమాన కంటెస్టెంట్ గెలవాలని ఎంతో తపన పడుతుంటారు ప్రేక్షకులు. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 8 గత సీజన్స్ కంటే భిన్నంగా సరికొత్తగా తీసుకువస్తున్నారు మేకర్స్. కాసేపటి క్రితం విడుదలైన బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో అదిరిపోయింది అని చెప్పక తప్పదు. ఎప్పటిలాగే హోస్ట్ అక్కినేని నాగార్జున తనదైన స్టైల్ లో సీజన్ 8లో పాల్గొనబోయే కంటెస్టెంట్ లను సరదా ప్రశ్నలతో నవ్వించారు.

Also Read: Nani : సరిపోదా శనివారం కలెక్షన్ల తుఫాన్.. ఆంధ్ర – తెలంగాణలో భారీ వర్షాలు ..

ఆలాగే ఈ సీజన్ లో సోలో ఎంట్రీ లేదని ప్రతిఒక్కరూ జోడితో ఎంట్రీ  ఇస్తున్నట్టు చూపించారు. అంతే కాకుండా ఈ సారి సీజన్ స్టార్టింగ్ లోనే బిగ్ బాస్ హౌస్ లోకి ముగ్గురు అతిధులు ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల విడుదలైన సరిపోదా శనివారం హీరో నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే విధంగా విడుదలకు రెడీగా ఉన్న 35 చిన్న కథ కాదు చిత్ర నిర్మాత రానా దగ్గుబాటి, కథానాయక నివేతా థామస్ లు బిగ్ బాస్ హౌస్ గెస్ట్ లుగా అడుగుపెట్టారు. లాస్ట్ లో సప్రైజ్ ఎంట్రీగా అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. కాగా బిగ్ బాస్ సీజన్ 8 ఈ రోజు సాయంత్రం 7గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది.

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్: 

1. నిఖిల్ మలియక్కల్, 2. ఆదిత్య ఓం. 3. యాంకర్ విష్ణు ప్రియ,4. కిరాక్ సీత, 5. అభయ్ నవీన్, 6. యష్మీ గౌడ, 7. నైనిక, 8. ప్రేరణ, 9. శేఖర్ బాషా, 10. పరమేశ్వర్ హివ్రాలే, 11. నైనిక, 12. సోనియా ఆకుల, 13. జబర్దస్త్ రాకేష్, 14. న్యూస్ రీడర్ కళ్యాణి, 15. మోడల్ రవితేజ, 16. నాగ పంచమి హీరో పృథ్వీరాజ్, 17. బెజవాడ బేబక్క, 18. నాగ మణికంఠ

Note: కంటెస్టెంట్ లిస్ట్ మాకున్న సమాచారం మేరకు అందించబడినదే.. మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేకపోలేదు..

Show comments