Site icon NTV Telugu

Big Boss 8 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?

Untitled Design (47)

Untitled Design (47)

బిగ్‏బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుయిల్ గా మూడో వారంలో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు బేబక్క, శేఖర్ బాషా ఎలిమినేట్ కాగా మూడవ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మూడో వారం ఎలిమినేషన్ సమయం వచ్చింది. అందుకు సంబంధిచిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ వారం మొత్తం హౌస్మేట్స్ ప్రవర్తన, ఆట తీరుపై శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కాసింత అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యారు. అలాగే ఎగ్స్ టాస్కులో అదరగొట్టిన అమ్మాయిలను అభినందించాడు. పదే పదే హాగ్ చేసుకుంటూ కంటెస్టెంట్ లను హగ్ చేసుకోవడంపై మణికంఠకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు నాగ్. ఇది ఇంకోసారి రిపీట్ అయితే హౌస్ నుండి బయటకు వెళ్తావ్ అని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు.

Also Read : Tovino Thomas : ఓనమ్ విన్నర్ టోవినో థామస్ ‘ARM’.. ఎన్ని కోట్లంటే..?

ఇదిలా ఉండగా మూడో వారం ఎలిమినేషన్ ఎవరనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపించినా చివరకు అభయ్ నవీన్ బయటకు రానున్నాడనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎగ్స్ టీంలో అభయ్ వర్సెస్ నిఖిల్ టీం పోటీపడాల్సి ఉండగా ఆ టాస్క్ లో అభయ్ తప్పుకున్నాడు. టీమ్ కష్టపడి ఎగ్స్ సంపాదిస్తే జాగ్రత్తగా కాపాడకుండా చూస్తూ ఉండిపోయాడు మిగిలిన సభ్యులు లఎగ్స్ ను కాపాడుతుంటే తనకు పట్టనట్టు దూరంగా కూర్చున్నాడు. దీంతో అభయ్ తీరుపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. ఇక గేమ్ ఆడకుండా అభయ్ బిగ్‏బాస్ ను ఇష్టమొచ్చినట్లు తిడుతూ ఉండడం, నువ్వు బిగ్‏బాస్ కాదు, బయాస్డ్ బాస్ అంటూ రెచ్చపోవడం కూడా. అభయ్ ఎలిమినేషన్ కు కారణమైందని తెలుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ అభయ్ బయటకు వచేసినట్టేనని నెటిజన్స్ అభిప్రాయం

Exit mobile version