Big Bollywood Production House planning to Do Virat Kohli Biopic with Ram Charan: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ లో ఒక బడా నిర్మాణ సంస్థ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుని రామ్ చరణ్ వద్దకు కథ పంపినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమాని బాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్న సమయంలో రామ్ చరణ్ తేజ, విరాట్ కోహ్లీ తనకు ఆదర్శమని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోనని కూడా ఆయన అప్పట్లో కామెంట్ చేశారు. ఈ మధ్యకాలంలో అనేక మంది క్రికెటర్లు, పొలిటికల్ లీడర్లు, సినీ హీరో, హీరోయిన్ల జీవిత కథ ఆధారంగా బయోపిక్ లు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రికెటర్ల విషయానికి వస్తే మహేంద్రసింగ్ ధోని, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ జీవితాల పై నిర్మించిన బయోపిక్స్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాప్ సంపాదించాయి.
Prabhas: ప్రభాస్ కి ఇష్టమైన రొయ్యల పలావ్ రెసిపీ ఇదే.. ఇక చరణ్ వంతు!
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ కి చెందిన ఒక బడా నిర్మాణ సంస్థ రామ్ చరణ్ కి విరాట్ బయోపిక్ కథ గురించిన సమాచారం పంపిందని, గతంలోనే ఆయన చేసిన కామెంట్లు ఆధారంగా రాంచరణ్ కి ఈ కథ పంపినట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతుందని అంటున్నారు. పాన్ ఇండియా లెవెల్లో కేవలం ఐదు భాషల్లోనే కాదు బెంగాలీ వంటి ఇతర భాషల్లోకి కూడా డబ్బింగ్ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి విరాట్ కోహ్లీకి రాంచరణ్ కి పోలికలు కూడా ఉంటాయని వారిద్దరి అభిమానులు భావిస్తూ ఉంటారు. అలాంటి విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్ నటిస్తే ఆ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అని చెప్పక తప్పదు. నిజ జీవితంలో విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అయిన అనుష్క శర్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అలాగే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఇండియా టీం ని లీడ్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఇవన్నీ బయోపిక్ లో తెరకెక్కిస్తే ఖచ్చితంగా సేలబుల్ సబ్జెక్ట్ అవుతుందని బాలీవుడ్ మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.