ప్రజంట్ టాలీవుడ్‌లో హిట్ కోసం తాపత్రయ పడుతున్న హీరోలో శర్వానంద్ ఒకరు. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న శర్యా నటుడిగానే కాదు, సినీ నిర్మాణంలోనూ పట్టు సంపాదించారు. ఆయన గతంలో కొన్ని సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారు. ఆ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టి ఓంఐ పేరుతో కొత్త బ్రాండ్‌ని ప్రారంభించారు. సినీ నిర్మాణాలతోపాటు, వెల్‌నెస్, హాస్పిటాలిటీ రంగాల్లోనూ ఈ బ్రాండ్‌పై ఉత్పత్తుల్ని తీసుకు రానున్నారు. ఇక ప్రజంట్ ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే..
శర్వానంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘భోగి’ షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు ప్రధాన షెడ్యూల్స్ పూర్తి చేసిన ఈ చిత్రానికి భారీ సెట్ వేశారని సమాచారం. అయితే కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. తాజాగా మళ్లీ ఈ వారం నుంచే సెట్స్‌లో సందడి మొదలవనుంది. శర్వానంద్ ప్రత్యేకంగా ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చేశాడట. దీంతో కీలక సన్నివేశాల షూటింగ్‌ను స్పీడ్‌గా పూర్తి చేయాలని యూనిట్ సీరియస్‌గా ప్లాన్ చేస్తోంది. జనవరి 2026 లో షూటింగ్ పూర్తి చేసి, సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఆషిక రంగనాథ్, కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. మొత్తానికి శర్వానంద్ మళ్లీ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా రెడీ అవుతున్నాడని చెప్పొచ్చు.
