Site icon NTV Telugu

‘భళా తందనాన’… మళ్ళీ మొదలైంది!

హీరో శ్రీ విష్ణు, ‘బాణం’ ఫేమ్ చైత‌న్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భళా తందనాన’. దీనిని సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరపాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్ లో మొదలైంది. శ్రీ విష్ణు సరసన క్యాథరిన్ ట్రెసా హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రతినాయకుడి పాత్రను ‘కేజీఎఫ్’ ఫేమ్ రామచంద్రరాజు పోషిస్తున్నాడు. కోవిడ్ కారణంగా సెట్ లో తగిన జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ జరుపుతున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రంలో ఐదు పాట‌లున్నాయి. సురేశ్ రుగుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా రైట‌ర్. మార్తాండ్ కె. వెంక‌టేశ్ ఎడిట‌ర్.

Exit mobile version