Site icon NTV Telugu

Bhairavam : నారా రోహిత్ ‘వరదా’ ఫస్ట్ లుక్.. మంచు మనోజ్ కామెంట్స్ వైరల్

Bhairavam

Bhairavam

తమిళ్ లో సూరి నటించిన హిట్ సినిమా గరుడన్. ఈ సినిమాను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ లీడ్ రోల్స్ లో విజయ్‌ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్‌ గడ సమర్పణలోకె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు.

Also Read : ManiRatnam : థగ్ లైఫ్ ఫస్ట్ గ్లింప్స్.. వింటేజ్ కమల్ బ్యాక్

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో బెల్లం కొండ శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ను ఇటీవల రిలీజ్ చేయగా అద్భుత స్పందన రాబట్టింది. అలాగే ఈ సినిమా నుంచి బుధవారం నారా రోహిత్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో నారా రోహిత్ వరదా పాత్రలో కనిపించనున్నాడు. సరికొత్త లుక్ లో నెరసిన జుట్టు, గెడ్డంతో నారా రోహిత్ పవర్ఫుల్ గా కనిపించాడు. ఇప్పటికి రిలీజ్ చేసిన రెండు పోస్టర్స్ లోను యాక్షన్‌ ప్రధాన ఆకర్షణగా ఉండేలా డిజైన్ చేసారు. కాగా నారా రోహిత్ లుక్ పై ఈ సినిమాలో మరొక పాత్రలో కనిపిస్తున్న యంగ్ హీరో మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నారా రోహిత్ ను ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేస్తూ ‘ ఎవడు తగ్గట్లేదుగా, మాస్ హీరోలందరూ లుక్స్ తో అదరగొడుతున్నారు. న్యూ మేకోవర్ దుమ్ములేచిపోయింది బాబాయ్’ అని కామెంట్స్ చేసారు. అన్నట్టు భైరవంలోని మంచు విష్ణు ఫస్ట్ లుక్ ను నవంబరు 8న రిలీజ్ చేయనున్నారు. భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతమందిస్తున్నారు. హరి కె.వేదాంతం ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version