Site icon NTV Telugu

Bhagyashree : భలేగా ఛాన్స్ లు కొట్టేస్తున్న భాగ్యశ్రీ

Bhagyashri

Bhagyashri

రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది భాగ్యశ్రీ భోర్సే. బాలీవుడ్ లో మెరిసి, టాలీవుడ్ ఇంట అడుగుపెట్టిన ఈ నయా అందం బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు కొల్లగొడుతోంది.  తోలి సినిమా డిజాస్టర్ అయినా కూడా ఈ అమ్మడికి అవకాశాలకు కొదవలేదనే చెప్పాలి. మిస్టర్ బచ్చన్ తో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే బాలీవుడ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి యూత్ గుండెల్లో వీణలు మోయించింది. ఆమెకు అందానికి ఫిదా కానీ తెలుగు ఆడియన్ లేరంటే అతిశయోక్తి కాదు.

Also Read : NBK 109 : భారీగా ‘డాకు మహారాజ్’ థియేట్రికల్ బిజినెస్

మిస్టర్ బచ్చన్ సినిమా హిట్టయితే ఆమె క్రేజ్ ఎవరెస్ట్ రేంజ్ కు ఎదిగేది. కానీ ఫట్ మనడంతో రావాల్సినంత ఇమేజ్ రాలేదు. అయితే ఈ అవరోధాలు ఆమెకు ఛాన్సుల రాకుండా ఆపలేకపోయాయి. టాలీవుడ్ లో ఒక్కొక్క ఆఫర్ ను కొల్లగొడుతూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రామ్ సరసన RAPO22 లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో చేసే గోల్డెన్ ఛాన్స్ టేకోవర్ చేసుకుంది. ఇదే కాదు దుల్కర్ సల్మాన్ ‘కాంత’లోను భాగ్యశ్రీ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో తొలిసారి మాలీవుడ్ లో కూడా అడుగుపెట్టనుంది భాగ్య శ్రీ. ప్లాప్ హీరోయిన్ అయినప్పటికీ ఆమె అందం, అభినయానికి టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి.  ఒక్క హిట్ పడితే భాగ్య శ్రీ అగ్ర హీరోయిన్ గా మారడం ఖాయం. మరీ ఏ హీరో ఆమెకు హిట్టిస్తాడో చూద్దాం..

Exit mobile version