BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎటు తిరుగుతుందో చెప్పడం చాలా కష్టం. మొదటి సినిమా ప్లాప్ అయితే ఆఫర్లు రావడం గగనమవుతుంది. కానీ, గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే విషయంలో మాత్రం టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తొలి సినిమాతోనే డిజాస్టర్ అందుకుంది. అయినప్పటికీ ఆమె గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఫిదా అయిన నిర్మాతలు ఆ వెంటనే వరుస అవకాశాలు ఇచ్చారు.
‘మిస్టర్ బచ్చన్’ తర్వాత భాగ్యశ్రీకి వరుసగా ప్రాజెక్ట్‌లు క్యూ కట్టాయి. ఆమె నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, ‘కింగ్డమ్’ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేక తీవ్రంగా నిరాశపరిచాయి. వరుస ప్లాపులు పడుతున్న సమయంలోనూ అక్కినేని అఖిల్ కాంబినేషన్లో వచ్చిన ‘లెనిన్’ చిత్రంలో హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు, సినిమా ఫలితానికి “ఓకే” అనే టాక్ వచ్చింది. కానీ విచిత్రమేమిటంటే పర్వాలేదనిపించిన సినిమా పడిన తర్వాతే టాలీవుడ్లో ఈ భామకు కొత్త ఆఫర్లు రావడం దాదాపుగా తగ్గిపోయాయి. తెలుగులో కొత్త ప్రాజెక్ట్‌లు సైన్ చేయకపోయినప్పటికీ ఇతర భాషల్లో భాగ్యశ్రీ బోర్సే భారీ ఆఫర్లనే సొంతం చేసుకుంటోంది. తమిళంలో ఏకంగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘సియోన్‘ చిత్రంలో శివకార్తికేయన్ సరసన కథానాయికగా నటిస్తోంది. మరోవైపు ‘ఆపరేషన్ గంగ’ అనే మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌తో మలయాళ చిత్రసీమలోకి కూడా అడుగుపెడుతోంది. తెలుగులో ప్రస్తుతానికి గ్యాప్ వచ్చినా, తమిళ, మలయాళ చిత్రాల విజయాలతో మళ్లీ టాలీవుడ్లో బిజీ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
- The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
- Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
- Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద 'ఫ్యామిలీ సినిమాల' హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
తాజావార్తలు
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!