Site icon NTV Telugu

Bhagavanth Kesari: మళ్ళీ భగవంత్ కేసరి కాంబో?

Bhagavanth Kesari

Bhagavanth Kesari

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత ఒక షెడ్యూల్ జార్జియాలో ప్లాన్ చేశారు. షూటింగ్ షెడ్యూల్ కోసం అమ్మవారి బాలకృష్ణ సహా టీం అంతా జార్జియా బయలుదేరబోతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే, ఇప్పుడు అనిల్ రావిపూడితో నందమూరి బాలకృష్ణ మరో సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

Read More:MaheshBabu : మహేశ్ తో బుచ్చిబాబు సినిమా.. నిజమా?

అసలు విషయం ఏమిటంటే, అనిల్ రావిపూడి ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది. దాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీస్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి మరోసారి నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అనిల్ టీం ఇప్పటికే ఒక కథ సిద్ధం చేసుకునే పనిలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ అఖండ సెకండ్ పార్ట్ తర్వాత గోపీచంద్ మలినేనితో ఒక సినిమా ప్లాన్ చేశారు.

Read More:Miss World 2025: మిస్ వరల్డ్ ఈవెంట్.. నగరంలో భారీ బందోబస్తు..!

ఆ సినిమా కూడా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ మరోసారి పట్టాలెక్కే అవకాశం ఉంది. వీరిద్దరూ కలిసి గతంలో చేసిన భగవంత్ కేసరి అనే సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాగా కూడా గుర్తింపు పొందింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా అనగానే అంచనాలు పెరిగిపోతున్నాయి.

Exit mobile version