ప్రజంట్ టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘భైరవం’. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ వంటి ముగ్గురు హీరోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మే 30 న విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా రీసెంట్‌గా మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ముగ్గురు వ్యక్తులు ,మూడు స్వభావాలు , వారి మధ్య స్నేహం , పగలు , ప్రతీకారాలు , పట్టింపులు ఇలా అన్నిటికి జస్టిఫికేషన్ చేస్తూ చూపించే కథలా అనిపిస్తుంది. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించారు బెల్లంకొండ శ్రీనివాస్.
Also Read : Vishal : నా జీవిత భాగస్వామి దొరికింది..త్వరలో గుడ్ న్యూస్ చెప్తా..
బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఛత్రపతి మూవీ హిందీలో రీమేక్ చేశారు. అయితే ఈ విషయం గురించి మాట్లాడుతూ..‘హిందీలో సినిమాలు చేసిన తెలుగు నటులు పెద్దగా లేరు. మా జనరేషన్‌లో అంటే ఉన్న వారిలో రానా, చరణ్ మాత్రమే చేశారు. కానీ ఛత్రపతి రీమేక్ విషయంలో తోందరపడ్డ. రాజమౌళి సినిమా 100శాతం విజయం సాధించింది. ఎమోషన్‌కు బాగా కనెక్ట్ అవుతారు అని అనుకున్నా. కానీ బాలీవుడ్ సవతి తల్లి లాంటిది, బిడ్డల సెంటిమెంట్లంటివి హిందీలో పెద్దగా ఉండవు అని నిర్మాత అల్ రెడి చెప్పారు. అయిన కూడా వర్కవుట్ అవుతుందని అనుకున్నాను. అప్పటికే దక్షిణాది చిత్రాలు ప్రేక్షకులు బాగా చూసేశారు. అందుకే ఆ సినిమా షూటింగ్ సమయంలో అది వర్కవుట్ అవుతుందా? లేదా అన్న డైలమాలో పడ్డ. దీంతో తెలియకుండా 100 శాతం దృష్టి పెట్టలేక పోయాను’ అంటూ తెలిపారు.
