NTV Telugu Site icon

BSS : ‘బెల్లంబాబు’ బర్త్ డే.. 4 సినిమాల స్పెషల్ అప్డేట్స్

Sweety

Sweety

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫ్యాన్స్ ముద్దుగా కాస్ట్లీ స్టార్ అని పిలుచుకుంటారు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూనే అల్లుడు శ్రీను సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు బెల్లంబాబు. తొలి సినిమాకే సమంతతో రొమాన్స్ చేసాడు, బోనస్ గా తమన్నాతో కలిసి చిందులు వేసాడు శ్రీను. వరుసగా సినిమాలు చేస్తున్నబెల్లంఅన్న గతేడాది బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. కాగా నేడు బాబు పుట్టిన రోజు సందర్భంగా రాబౌయే సినిమాలు నుండి స్పెషల్ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్.

భైరవం : విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను కేకే రాధా మోహన్ నిర్మిస్తున్నారు. బెల్లంకొండ బర్త్ డే కానుకగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

టైసన్ నాయుడు – బీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నేహా శెట్టితో బెల్లం బాబు రొమాన్స్ చేయనున్నాడు.

BSS 11 : కౌశిక్ పెగాళ్ళపాటి దర్శకత్వంలో బెల్లంకొండ  కెరీర్ లో 11వ సినిమాగా వస్తున్న ఈ  చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాహు గారపాటి నిర్మాణంలో షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించనున్నారు. నేడు సాయి బర్త్ డే విశేష్ తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

BSS 12 : మూన్ షైన్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాతో మరోసారి సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో వస్తున్నాడు సాయి. లక్కీ భామగా పేరొందిన సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

 

Show comments