నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ఎలాంటి విషయాలైన అయిన మొహమాటం లేకుండా బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అయితే తాజాగా హైదరాబాద్‌లో బండ్ల గణేశ్ టాలీవుడ్ ప్రముఖుల కోసం దీపావళి వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, తేజ సజ్జ వంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో, బండ్ల గణేష్.. తేజ సజ్జా గురించి కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.
Also Read : Lenin: అఖిల్ ‘లెనిన్’లో సర్ప్రైజ్ గెస్ట్ రోల్ – సీనియర్ హీరోతో పవర్‌ఫుల్ క్లైమాక్స్
ఇంతకీ, బండ్ల గణేశ్ ఏం మాట్లాడారు అంటే.. ‘భారతీయ చిత్ర పరిశ్రమలో తదుపరి అల్లు అర్జున్.. తేజ సజ్జా” అంటూ కామెంట్స్ చేశారు. బండ్ల గణేష్ ఈ కామెంట్స్ చేయగానే.. ఈ వేడుకకు హాజరైన వారందరందరు చప్పట్లు కొట్టడం విశేషం. ఇక ఇటీవల బ్లాక్ బస్టర్ మిరాయ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ సజ్జా, ఇప్పుడు ‘జాంబీ రెడ్డి 2’ కోసం మరోసారి దర్శకుడు ప్రశాంత్ వర్మ తో జత కడుతున్నారు. ఇది వారి మూడవ ప్రాజెక్ట్. ఈ చిత్రం జనవరి 2027 లో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్ విడుదల కానుంది. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
