Site icon NTV Telugu

Bandla Ganesh Party: ప్లేట్ 15వేలు.. నైటుకు కోటిన్నర

Bandla Ganesh

Bandla Ganesh

నటుడిగా ఎన్నో సినిమాలు చేసి, నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. అటూ ఇటూగా ఎన్నో సినిమాలు చేసినా, గుర్తింపు నిర్మాతగా చేసిన కొన్ని సినిమాలకే ఆయనకు వచ్చేసింది. అయితే, ఈ మధ్యన ఆయన దీపావళి పార్టీ పేరుతో సినీ పరిశ్రమ సహా కొంతమంది రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి ఒక పెద్ద పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పార్టీ కోసం బండ్ల గణేష్ గట్టిగానే ఖర్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీ కోసం ఆయన ఒక్కొక్క ప్లేటుకి 15 వేల రూపాయలు వెచ్చించి విందు ఏర్పాటు చేశారు.

Also Read:K Ramp : మీరిచ్చిన సక్సెస్‌ను మీతోనే సెలబ్రేట్ చేసుకుంటా.. కిరణ్ అబ్బవరం

అంతేకాక, పార్టీ మొత్తానికి అంటే ఒక రోజు నైట్ కోసం సుమారు కోటిన్నర రూపాయల ఖర్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సహా తేజ సజ్జా, సిద్దు జొన్నలగడ్డ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి వాళ్ళు హాజరయ్యారు. అయితే, ప్రస్తుతానికి నిర్మాతగా సినిమాలు చేయకుండా ఉన్న బండ్ల గణేష్ ఈ పార్టీ కోసం ఎందుకు అంత ఖర్చు పెట్టారు అనే విషయం మీద చర్చ జరుగుతోంది. అయితే, నిజానికి బండ్ల గణేష్ ప్రతి ఏడాదీ ఇదే విధంగా ఖర్చుపెట్టి టపాసులు కొని తన ఊరిలో కాలుస్తూ ఉంటారు. అయితే, ఈసారి భిన్నంగా, సినీ పరిశ్రమ తనను ఇంతవాడిగా చేసిన నేపథ్యంలో, తనకు ఆప్తులను అందరినీ పిలిచి పార్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన పార్టీ ఇచ్చినట్లుగా సమాచారం.

Exit mobile version