పాక్ లో “షేర్ షా”పై బ్యాన్… కారణం ఇదేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన వార్ మూవీ “షేర్ షా” ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమాకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 12న అమెజాన్‌లో విడుదలైంది. మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా నటన అందరినీ ఆకట్టుకుంటోంది. కెప్టెన్ విక్రమ్ బాత్రా బయోపిక్ ఈ ఏడాది అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా “షేర్ షా” చిత్రాన్ని పాకిస్థాన్‌లో బ్యాన్ చేసిన మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Read Also : ఓటీటీ కోసం తెలుగులో మరో కొత్త ‘బిగ్ బాస్’
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
ఓ ప్రముఖ మీడియా సంస్థ సమాచారం ప్రకారం ఒక పాకిస్థానీ యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఈ విషయం గురించి వెల్లడించాడు. పాకిస్తాన్‌లో ఈ సినిమాను బ్యాన్ చేశారని, అయినప్పటికీ తాను ఆ సినిమాను చూడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే ఈ చిత్రం పాకిస్తాన్‌లో విడుదల చేశారా ? లేదా? అనే విషయంపై అధికారిక అప్‌డేట్ రాలేదు.
అయితే పాకిస్తాన్ మన ఇండియా కెప్టెన్ విక్రమ్ బాత్రా చేసిన సాహసాన్ని పాకిస్తానీ ప్రజలకు చూపించడానికి ఇష్టపడటం లేదని, అందుకే బ్యాన్ చేసి ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా విక్రమ్ బాత్రా తన ప్రాణాలను లెక్క చేయకుండా పాకిస్తానీలను చంపినట్లు చిత్రంలో చూపించారు. పాకిస్తాన్‌లో భారతీయ చిత్రాన్ని బ్యాన్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా “ఫాంటమ్” చిత్రం విడుదలను నిషేధించారు. ఈ చిత్రం హుస్సేన్ జైదీ నవల ‘ముంబై ఎవెంజర్స్’ ఆధారంగా రూపొందించబడింది. ఇంకా బంగిస్తాన్, ఏక్ థా టైగర్, రాజనా, భాగ్ మిల్ఖా భాగ్, ఏజెంట్ వినోద్, తేరే బిన్ లాడెన్, లాహోర్ వంటి అనేక సినిమాలను అక్కడ ప్రదర్శించకుండా బ్యాన్ చేశారు.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!