Site icon NTV Telugu

Akhanda 2 : డ్రగ్స్‌పై బాలయ్య వార్.. బోయపాటి స్టైల్‌లో మాస్ ట్రీట్మెంట్!

Akanda 2

Akanda 2

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌కి టాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వరుస డిజాస్టర్స్ వస్తున్న టైం లో, ‘సింహ’ సినిమాతో బాలకృష్ణకు అద్భుతమైన విజయాన్ని అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ కాంబో వస్తే మాస్ ఆడియన్స్ థియేటర్లలో పండగ చేసుకోవడం ఖాయం. ఇప్పటికే “సింహా”, “లెజెండ్”, “అఖండ” వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఈ జంట ఇప్పుడు “అఖండ 2”తో వస్తోంది. మొదటి భాగం అద్భుతమైన విజయాన్ని సాధించడం తో, రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘అఖండ 2’లో బాలయ్య లుక్‌, బోయపాటి డిజైన్ చేసిన మాస్ సన్నివేశాలపై ఫ్యాన్స్‌లో ఉత్సాహం మరింత పెరిగింది. ముఖ్యంగా..

Also Read : Mahavatar Narasimha : మహావతార్ నరసింహా మూవీపై చాగంటి ప్రశంసలు..

ఈసారి కేవలం యాక్షన్, ఎమోషన్ మాత్రమే కాదు, సమాజానికి బలమైన సందేశం ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఫస్ట్ హాఫ్‌లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ద్వారా ‘గంజాయి – డ్రగ్స్ వ్యతిరేకంగా’ సందేశం ఇస్తారట. ఈ సీన్‌లో బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్స్, ఆయన ధాటికి విలన్లు వణికిపోయేలా ఉండబోతుందని అంటున్నారు. ఇక ఈ ఫైట్ ద్వారా డ్రగ్స్ వ్యసనం ఎంత ప్రమాదకరమో, యువతను అది ఎటువంటి దారిలో నడిపిస్తుంది చూపించే ప్రయత్నం చేయనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. బోయపాటి స్టైల్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు సోషల్ మెసేజ్ కలిస్తే, ఆ సీన్ అభిమానులకు గూస్‌బంప్స్ కలిగించకుండా ఉండదు.

Exit mobile version