టాలీవుడ్ లో స్టార్ హీరోల కొడుకులు హీరోలుగా వెండితెరపై ఎంట్రీ ఇస్తారు కానీ వారి డాటర్స్ మాత్రం స్క్రీన్ పై కనిపించడం అరుదు. 90స్ లో సూపర్ స్టార్ కృష్ణ కూతరు మంజుల హీరోయిన్ గా బాలయ్య సరసన చేయబోతోంది అంటే ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే చాలా వరకు హీరోల డాటర్స్ స్క్రీన్ పై కనిపించేందుకు ఇష్టపడరు. ప్రస్తుతం స్టార్ హీరోలైన చిరు, బాలయ్య డాటర్స్ నిర్మాతలుగా రాణిస్తున్నారు. వెంకీ డాటర్స్ సినిమాలు దూరంగా ఇతర రంగాలలో రాణిస్తున్నారు.
Also Read : Manchu Manoj : మనోజ్ మంచు నెక్ట్స్ ఏంటి?
కానీ బాలయ్య చిన్న కూతురు నందమూరి తేజశ్వని ఇప్పుడు కెమెరా ముందుకు వస్తోంది. ప్రస్తుతం అఖండ 2 కు సహా నిర్మాతగా కూడా తేజు వ్యవహరిస్తోంది. ఇన్నిరోజులు తండ్రి బాలయ్య సినిమాల వ్యవహారాలు చూస్తూ వస్తున్న తేజు ఇప్పుడు కేమెరా ముందు నటించింది. అయితే అది సినిమా కాదులెండి. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌కు నందమూరి తేజస్విని బ్రాండ్ అంబాసిడర్ గా వ్యహరిస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ యాడ్ షూట్ కూడా ఫినిష్ చేసారు తేజస్విని. ఈ జ్యువెలరీ బ్రాండ్ మరియు ఇతర ప్రమోషన్స్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
