NTV Telugu Site icon

Bobby : బాలయ్య గుర్రపు స్వారీ చూసి మేము షాక్ అయ్యాం

Daaku

Daaku

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్స్ గా, దర్శకుడు బాబీ తెరకెక్కించిన అవైటెడ్ మూవీ ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్.  రాయలసీమ మాలుమ్ తేరుకో.. ఏ మేరా అడ్డా..వంటి డైలుగులు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి కొన్ని గంటల్లో డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో రిలీజ్ కానున్నాడు .

Also Read : AlluArjun : నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కు ఊరట..

డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో భాగంగా  దర్శకుడు బాబి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలయ్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘ డాకు మహారాజ్ మెజారిటీ షూట్  జైపూర్ లో చేసాం. అక్కడ సినిమాలోని కీలక సన్నివేశాలు అయిన హార్స్ రైడింగ్ సీక్వెన్స్ తెస్తున్నాం. అయితే హైదరాబాద్ నుంచి రావాల్సిన గుర్రం లేట్ అవుతుందని లోకల్ లో ఒక గుర్రాన్ని సెట్ చేసాం. అది మ్యాడ్ గుర్రం, దాని సొంత యజమానిని కూడా రెండుసార్లు కింద పాడేసింది. ఈ విషయాన్ని బాలయ్యకు మా ఫైట్ మాస్టర్ వెంకట్ వెళ్లి చెప్పారు. కానీ బాలయ్య అవేం లెక్క చేయకుండా దాని బొంద అదేం చేస్తుంది అంటూ ఆ గుర్రాన్ని డొక్కలో ఒక్క తన్ను తన్ని పైకి ఎక్కి స్వారీ చేస్తుంటే మేమంతా షాక్ అయ్యాం. ఆయన దెబ్బకి గుర్రం సెట్ అయిపోయింది’  దటీజ్ బాలయ్య అని అన్నారు.

Show comments