Site icon NTV Telugu

Balakrishna : ‘అఖండ 2’ బిగ్ అప్డేట్‌కు ముహూర్తం ఫిక్స్..

Akanda 2

Akanda 2

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ 2’. దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీపై, అభిమానుల్లో అంచనాలు, భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతుండగా, ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. పార్ట్ వన్ లో చేసిన విధ్వంసం కంటే కూడా.. పార్ట్‌2 లో అంతకు మించి ఉంటుందట. మరి ఈ సారి స్పీకర్‌లు ఎలా బద్దలవుతాయె చూడాలి. అయితే ఈ సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్న విషయం తెలిసిందే. దీంతో తాజాగా..

Also Read : Ravi Teja : మాస్ రాజా ర‌వితేజ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..

అఖండ ‘తాండవం షురూ’ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్‌  జూన్ 8న అంటే ఈ రోజు ఉదయం 10.54 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఓ పోస్ట్ ద్వారా సోషల్ మీడియా తెలిపింది. మరి ఈ అప్డేట్ ఏమై ఉంటుంది అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version