Site icon NTV Telugu

Balakrishna: కలవడానికొచ్చిన అభిమానితో కలిసి భోజనం చేసిన బాలకృష్ణ

Balakrishna

Balakrishna

Nandamuri Balakrishna had Lunch with his Fan at Kurnool: కర్నూలు జిల్లాలో హీరో నందమూరి బాలకృష్ణను కలవడానికి వచ్చిన అభిమానితో కలిసి భోజనం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో నందమూరి బాలకృష్ణ 107 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో బాలకృష్ణను కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అభిమాని సజ్జద్ కావడానికి వెళ్ళాడు. అనుమతి తీసుకుని షూటింగ్ గ్యాప్ లో బాలయ్యతో కలిసి మాట్లాడాడు. ఈ క్రమంలో ఆ అభిమానితో కలిసి నందమూరి బాలకృష్ణ భోజనం చేశారు. ఇక ఆ అనంతరం బాలకృష్ణ అభిమాని సజ్జద్ మాట్లాడుతూ తాను హీరో నందమూరి బాలకృష్ణ వీరాభిమానని అందులో భాగంగా ఇవాళ తమ అభిమాన హీరో నందమూరి బాలకృష్ణని కలవడం జరిగిందన్నారు.

Ali: రాజకీయాలకు అలీ గుడ్ బై.. ఏ పార్టీ వాడిని కానంటూ వీడియో విడుదల

అంతే కాకుండా ఆయనతో పాటు కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు సజ్జద్. ఇక బాలయ్య తన అభిమానితో కలిసి భోజనం చేస్తున్న వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి బాలకృష్ణకు ముక్కు మీదే కోపం ఉంటుందని అభిమానులను కొడతాడని రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి. దానికి తోడు కాస్త ఓవరాక్షన్ చేసిన అభిమానుల మీద ఆయన చేయి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉండేవి. అలాంటి బాలయ్య ఇమేజ్ ను అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే షో ఒక్కసారిగా మార్చేసింది. ఇప్పుడు కూడా మా బాలయ్య బంగారంరా అంటూ ఆయన అభిమానులు ఈ భోజనం చేస్తున్న వీడియోను వైరల్ చేస్తున్నారు.

Exit mobile version