NTV Telugu Site icon

NBK 109: టైటిల్ విషయంలో బాలయ్య మాటే ఫైనల్

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ కి ఇప్పుడు గోల్డెన్ ఎరా నడుస్తోంది. ఆయన సినిమాలు చేస్తే సినిమాలు హిట్ అవుతున్నాయి, షోలు చేస్తే షోలు హిట్లవుతున్నాయి. రాజకీయాల్లో దిగితే అక్కడ కూడా ఎదురే లేకుండా ఫలితాలు వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమా చేస్తున్నాడు బాబీ దర్శకత్వంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని నిర్మాతలు కంకణం కట్టుకున్నారు. రేపు అంటే శుక్రవారం నాడు సినిమాకి సంబంధించిన టైటిల్ తో పాటు చిన్న టీజర్ అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నారు అయితే ఈ టైటిల్ విషయంలోనే నందమూరి బాలకృష్ణకు సినిమా దర్శక, నిర్మాతలకు మధ్య భిన్న అభిప్రాయాలు ఏర్పడినట్లుగా తెలుస్తోంది.

Pushpa 2: కోట్లు మిగిలించిన సుకుమార్ ఐటెం నిర్ణయం!

ఈ సినిమాకి సంబంధించి ఎన్నో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. చివరిగా రెండు టైటిల్స్ ని కన్సిడర్ చేస్తున్నారు. సర్కార్ సీతారాం, డాకు మహారాజ్ అనే రెండు టైటిల్స్ ప్రస్తుతానికి పరిశీలనలో ఉన్నాయి. బాబీ సహా నిర్మాతలు సర్కారు సీతారాం అనే టైటిల్ బాగుంటుందని దాన్నే ఫిక్స్ చేయాలని భావిస్తుంటే బాలకృష్ణ మాత్రం డాకు మహారాజ్ అనే ఫిక్స్ చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో డాకు మహారాజుగా బాలకృష్ణ కనిపిస్తారని అందుకే అదైతే పర్ఫెక్ట్ టైటిల్ అని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే చివరికి బాలకృష్ణ చెప్పిన మేరకే డాకు మహారాజు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రేపు టైటిల్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు రేపు రిలీజ్ చేయబోయే టైటిల్ టీజర్ లోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి ఇతర కీలక పాత్రలలో నటించబోతున్నారు. దుల్కర్ సల్మాన్ కూడా ఒక కీలకపాత్రలో కనిపిస్తారని ప్రచారం ముందు నుంచి జరుగుతోంది.

Show comments