Site icon NTV Telugu

Akhanda 2: బరిలో దిగాల్సిందే అంటున్న బాలయ్య

Akhanda 2 Thaandavam

Akhanda 2 Thaandavam

Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సెకండ్ పార్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ కట్ ఒక్కసారిగా ఆ అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ వస్తుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ డేట్‌కి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కూడా వస్తుండడంతో అఖండ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం మొదలైంది. దానికి రెండు కారణాలు: ఒకటి ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ లేట్ అయ్యే అవకాశం ఉండడం, రెండు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఒకే కూటమిలో ఉన్నారు కాబట్టి ఒకరికోసం ఒకరు సినిమా త్యాగం చేసుకోవచ్చు అనే ఆలోచన. అయితే గ్రాఫిక్స్ వర్క్ విషయంలో ఎలాంటి ఆలస్యం జరగదని ఇన్సైడ్ టాక్. ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్‌కే సినిమా రిలీజ్ చేయాలని బాలకృష్ణ సహా బోయపాటి పట్టుదలగా ఉన్నారట. ఒకవేళ ఓజీ సినిమా నిర్మాతలు వెనక్కి వెళ్లమని అడిగితే అప్పుడు ఆలోచిస్తారేమో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం చెప్పిన డేట్‌కి రావాలని ఫిక్స్ అయ్యారు. ఈ రోజుల్లో ఓటీటీ డీల్ పూర్తిగా కాకుండా సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధపడటం లేదు నిర్మాతలు, కానీ బాలకృష్ణ, బోయపాటి మాత్రం ఓటీటీ డీల్ అవ్వకపోయినా ఏమాత్రం గురించి తగ్గేది లేదని చెప్పేశారట. నిజానికి ఈ సినిమా కొనేందుకు అమెజాన్‌తో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థలు ఆసక్తి చూపించాయి. అమెజాన్ కంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రేసులో ముందుంది. అయితే అమౌంట్ దగ్గర ప్రస్తుతానికి బేరసారాలు సాగుతున్నాయి. అది ఫైనల్ అయితే ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అవ్వచ్చు.

Exit mobile version