హెబ్బా పటేల్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దాదాపు పుష్కర కాలం అవుతున్నా ఇంకా నిలకడ లేని కెరీర్నే కంటిన్యూ చేస్తుంది. కుమారి 21 లాంటి అడల్ట్ కంటెంట్ సబ్జెక్ట్‌తో హబ్బా హెబ్బా అనిపించుకోగలిగింది కానీ ఈ క్రేజ్ కాపాడుకోవడంలో తడబడింది. పోనీ గ్లామరస్ సీన్స్ చేయదా అంటే అదీ కాదు అందాల ఆరబోత, లిప్ లాక్స్ వంటి సీన్లకు నో చెప్పదు. అయినా టైర్ వన్ హీరోలతో జోడీ కట్టే ఛాన్సులు రాలేదు.
Also Read : Venky77 : విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47”
ఓదెల రైల్వే స్టేషన్ లో డీ గ్లామర్ రోల్ చేసినా హెబ్బా ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. ఓదెల2లో నటించినా నో ఇంపార్టెన్స్. ఇక కెరీర్ డైలామాలో పడిపోతున్న టైంలో మరోసారి గ్లామర్‌నే నమ్ముకుంది బ్యూటీ. అదీ కూడా అడల్ట్ కంటెంట్ మూవీ మారియోతో రాబోతోంది. ఇప్పుడు తనలోని పాత టాలెంట్ బయటకు తీస్తోంది. మరింత గ్లామర్ డోస్ పెంచి మళ్లీ యూత్ అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది హెబ్బా. డిసెంబర్ 19న థియేటర్లలోకి రాబోతోంది మారియో ఫిల్మ్. మారియో కన్నా వారం ముందే థియేటర్లలో హారర్ ఫిల్మ్ ఈషాతో సందడి చేయబోతోంది హెబ్బా. యంగ్ హీరో త్రిగుణ్‌తో కలిసి మరోసారి జోడీ కడుతోంది. 24 కిస్సెస్ అనే చిత్రంలో ఈ ఇద్దరు కలిసి నటించారు. రాజు వెడ్స్ రాంబాయ్ ఫేం అఖిల్ రాజ్, సిరి హన్మంత్ మరో జోడీ. డిసెంబర్ 25న థియేటర్లలోకి రాబోతోంది ఈషా. శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి అప్ కమింగ్ హీరోలతో జోడీ కట్టి స్టార్ హీరోలకు దూరమైంది హెబ్బా. మరి ఈ సినిమాలైనా ఆమెను గట్టెక్కిస్తాయో లేదో..?
