గత కొద్దిరోజులుగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు తెరమీదకు వస్తున్నాయి. అయితే వారి నుంచి ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు లేకపోయినా పదేపదే వారి విడాకులు వార్తలు మాత్రం మీడియాలో, సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మరో ఆసక్తికరమైన వ్యవహారంలో అభిషేక్ బచ్చన్ పేరు మీడియాలో మారుమోగుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఆస్తులపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఈసారి ఏకంగా ఒకటి రెండు కాదు ఏకంగా 10 అపార్ట్‌మెంట్లు కొన్నారు ఈ తండ్రీకొడుకులు. ముంబైలోని ములుంద్‌లో అమితాబ్-అభిషేక్ 10 అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేశారు. ఈ మొత్తం 10 అపార్ట్‌మెంట్ల మొత్తం ధర దాదాపు రూ.24.95 కోట్లు. ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల గురించిన సమాచారం కూడా తెర మీదకు వచ్చింది.
Air Pollution: దయచేసి బయట ఎక్కువగా తిరగొద్దు.. ఢిల్లీలో గాలి నాణ్యత బాగా లేదు..
ఒబెరాయ్ రియల్టీ ప్రాజెక్ట్ ఒబెరాయ్ ఎటర్నియాలో అమితాబ్ – అభిషేక్ 10 అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒబెరాయ్ ఎటర్నియా ప్రాజెక్ట్‌లో 3 BHK మరియు 4 BHK అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. ఇక అందుతున్న సమాచారం మేరకు బచ్చన్ కుటుంబం కొనుగోలు చేసిన ఈ 10 ఫ్లాట్లన్నీ 10,216 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. బచ్చన్ కుటుంబం 10 ఫ్లాట్లతో పాటు 20 కార్ పార్కింగ్ స్థలాలను కూడా కొనుగోలు చేసింది. 10 ఫ్లాట్లలో 8 కార్పెట్ ఏరియా 1049 చదరపు అడుగులు కాగా, మిగిలిన 2 అపార్ట్‌మెంట్ల కార్పెట్ ఏరియా 912 చదరపు అడుగులు. తండ్రీకొడుకులు 10 ఫ్లాట్లకు రూ.1.50 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.3 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఈ ఫ్లాట్లన్నీ అక్టోబర్ 9, 2024న రిజిస్ట్రేషన్ చేయబడ్డాయని తెలుస్తోంది. ఈ 10 ఫ్లాట్లలో 6 అభిషేక్ బచ్చన్ కొనుగోలు చేశారు, వాటి ధర రూ. 14.77 కోట్లు. అమితాబ్ బచ్చన్ 4 ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఇక అమితాబ్, అభిషేక్ బచ్చన్ 2020 -2024 మధ్య రియల్ ఎస్టేట్‌లో మొత్తం 200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు.