NTV Telugu Site icon

AlluArjun : పుష్ప – 2 దాటికి తట్టుకోలేకపోయిన ‘బేబీ జాన్’

Baby John

Baby John

పుష్పరాజ్ క్రేజ్‌కు ఇండియాలో పోటీగా మరో సినిమా రిలీజ్ కాలేదు. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది పుష్ప 2. మొదటి రోజు ఏకంగా రూ.  294 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మొదటి ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టి  రెండు వారాల్లో రూ. 1500 కోట్లు, మూడు వారాల్లో రూ. 1700 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఒక్క హిందీలోనే రూ. 700 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికీ హిందీలో పుష్పరాజ్ కుమ్మేస్తున్నాడు. దానికి నిదర్శనమే 21వ రోజు హిందీ కలెక్షన్స్ అని చెప్పాలి.

Also Read : Aditya Om : గిరిజన గ్రామాలకు స్వచ్ఛమైన నీరు అందించనున్న నటుడు ఆదిత్య ఓం

పుష్ప- 2 రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత థియేటర్లోకి వచ్చిన బేబీ జాన్ సినిమా కంటే పుష్ప 21వ రోజు కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి. అసలు పుష్పరాజ్ హవా తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా ఉంది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘బేబీ జాన్’ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ అయింది. ఇండియాలో ఈ సినిమా ఫస్డ్ డే కలెక్షన్స్ కేవలం రూ. 12 కోట్ల నెట్ మాత్రమే వచ్చినట్టుగా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. కానీ 21వ రోజు కూడా పుష్ప రూ. 19 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచిందని అంటున్నారు. ఇందులో ఒక్క హిందీలోనే రూ.  15 కోట్లు వచ్చినట్టు అంచనా. ఈ లెక్కన నార్త్‌లో పుష్పగాడి రూలింగ్‌కు లాంగ్ రన్‌లో రూ. 800 కోట్లు ఈజీగా వస్తాయని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.

Show comments