Site icon NTV Telugu

Anand Deverakonda : 90’s దర్శకుడితో ‘బేబీ’ కాంబో.. క్లాప్ కొట్టిన నేషనల్ క్రష్

Anand Deverakonda

Anand Deverakonda

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘బేబీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై యూత్ ను ఎంతో ఆకట్టుకుంది. నటన పరంగా ఇద్దరికి మంచి మార్కులు పడ్డాయి. ఇక తాజాగా వీరి కాంబోలో మరో సినిమా రాబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నేడు ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు. కాగా..

Also Read : Mamitha : భారీగానే డిమాండ్ చేస్తున్న ప్రేమ‌లు బ్యూటీ.. !

ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి గెస్ట్ గా రష్మిక మందన్న వచ్చి క్లాప్ కొట్టింది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈ సినిమాని అనౌన్స్ చేస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆదిత్య హాస‌న్ దర్శకత్వంలో ఈటీవి విన్ ఓటీటీలో వచ్చిన #90’s వెబ్ సిరీస్‌కు కొనసాగింపుగా ఈ సినిమా ఉండనుందని క్లియర్ గా అర్ధం అయ్యింది. 90’s సిరీస్‌లో చిన్నపిల్లవాడు అయిన ఆదిత్య ప‌ది సంవ‌త్సరాల త‌రువాత పెద్దవాడు అయితే అతని లవ్ స్టోరీతో ఈ సినిమా ఉండబోతుంది. ఇక 90s సిరీస్ లో ఉన్న శివాజీ, వాసుకి ఈ సినిమాలో కూడా కంటిన్యూ ఉండబోతున్నారు.

Exit mobile version