NTV Telugu Site icon

Baaghi4 : బాబోయ్ టైగర్ ష్రాఫ్.. సీక్వెల్స్ తో చంపేలా ఉన్నాడు

Tiger

Tiger

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ తొలినాళ్లలో శరత్ దర్శకత్వంలో నటించిన చిత్రం వర్షం. ఈ సినిమాతో ప్రభాస్ సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను ఆ మధ్య బాలీవుడ్ లో బాఘీ అనే పేరుతొ రీమేక్ చేసాడు జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు విలన్ రోల్ లో నటించిన ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు టైగర్.

Also Read : Jani Mastar : త్వరలో నేనేంటో నిరూపించుకుంటా..

బాఘీ సక్సెస్ అవడంతో దానికి కొనసాగింపుగా బాఘీ -2 తీసుకు వచ్చాడు.ఈ సీక్వెల్ పర్లేదు అనిపించుకుంది. కొన్నాళ్ల తర్వాత ఈ సీక్వెల్ గా మరొక సీక్వెల్ బాఘీ – 3 చేసాడు టైగర్ ష్రాఫ్. కథను అంతగా పట్టించుకోకుండా కేవలం యాక్షన్‌ సీక్వెన్స్‌తో సినిమాలు చేయడంట్ టైగర్ ష్రాఫ్ స్పెషల్. ఇక బాఘీ -3 సీక్వెల్ కూడా ఓ మోస్తరు హిట్ కావడంతో ఇక ఆలస్యం ఎందుకు అనుకున్నాడు ఏమో బాఘీ -3 కి సిక్వెల్ గా బాఘీ – 4 ను ప్రకటించాడు టైగర్ ష్రాఫ్. తెలుగులో గోపీచంద్ తో భీమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు ఎ.హర్ష బాఘీ 4 ను డైరెక్ట్ చేయనున్నాడు.  సాజిద్ నడియావాలా ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నాడు.  తాజగా బాఘీ -2 ను అధికారక  పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. వచ్చే ఏడాది సెప్టెంబరు 5న విడుదల చేస్తామని డేట్ కూడా ప్రకటించారు. మరోవైపు ఈ టైగర్ ష్రాఫ్ సిక్వెల్స్ తో చంపేలా ఉన్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Show comments